ఆనందయ్య మందుపై ఎంత భారీగా చర్చ జరిగిందో.. ఆయన మందుతో తాను కోలుకున్న వైనాన్ని మహా హుషారుగా చెప్పిన కోటయ్య మాష్టారి వీడియో ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై.. అప్పటివరకు తీసుకుంటున్న వైద్యాన్ని పక్కన పెట్టి ఆనందయ్య మందు కోసం రావటం.. మందు వేసుకున్నంతనే హుషారుగా ఆయన ఆనందయ్య మందును పొగిడేయటం తెలిసిందే.
ఆనందయ్య మందు వాడిన కొద్ది రోజులకు కోటయ్య తీవ్ర అస్వస్థతకు గురి కావటం.. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చటం తెలిసిందే. ఆయన తాజాగా మరణించారు. దీంతో ఆనందయ్య మందును ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలుపెట్టాయి కొన్ని చానళ్లు. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం ఆనందయ్య మందుకు ఓకే చెప్పేయటం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆనందయ్యను.. కోటయ్య మాష్టారి ఉదంతంపై స్పందించాలని కోరారు.
దీనిపై మాట్లాడిన ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కోటయ్య మాష్టారు మే 16.. 17 తేదీల్లో తన వద్దకు వచ్చి మందు తీసుకున్నారన్నారు. ఆ వెంటనే కోలుకొని ఇంటికి వెళ్లారని.. ఆ తర్వాత ఆయన మళ్లీ ఆసుపత్రిలో చేరాడన్నారు. ఆసుపత్రిలో ఏ మందులు తీసుకున్నారో? ఏ చికిత్స తీసుకున్నారో తనకు తెలీదని..ఆ వైద్యం వికటించటం వల్లే ఆయన మరణించి ఉండొచ్చు అంటూ ఆనందయ్య తన రియాక్షన్ లో తెలిపారు.
ఆనందయ్య మందును కోటయ్య మాష్టారు మే16న తీసుకుంటే.. ఆయన మరణం మే 30న చోటు చేసుకుంది. మధ్యలో ఉన్న పద్నాలుగు రోజుల్లో ఏం జరిగింది? ఆయనకు జరిగిన వైద్యం ఏమిటన్నది కూడా కీలకమే. దీనిపై మరింత లోతైన అధ్యయనం చేసిన తర్వాతే.. ఆయన మరణానికి కారణం ఏమిటన్న దానిపై వ్యాఖ్యలు చేయటం సబబుగా ఉంటుంది.