హైకోర్టుకెక్కిన ఆనందయ్య

Update: 2021-12-31 06:34 GMT
కరోనా సమయంలో ఆయుర్వేద మందు పంపిణీతో రోగాన్ని తగ్గించిన ఆనందయ్య ఒక్కసారిగా మీడియాలో, ప్రజల్లో ఫేమస్ అయ్యారు. ఆయన మందు కరోనాను తగ్గించడంతో తండోపతండాలుగా ప్రజలు పోటెత్తారు. ఇక తాకిడిని తట్టుకోలేక ప్రభుత్వం ఆపుచేయించడం.. దాని విశ్వసనీయతపై పరీక్షలు చేయడంతో కొంచెం గ్యాప్ వచ్చింది. చివరకు హైకోర్టు జోక్యంతో మళ్లీ ఆనందయ్య మందు పంపిణీ మొదలైంది.

తాజాగా ప్రపంచాన్ని ‘ఒమిక్రాన్’ కమ్మేస్తోంది. ఒమిక్రాన్ కు కూడా మందు తయారు చేశానని ఆనందయ్య ప్రకటించి పంపిణీ కూడా చేస్తున్నారు. దీంతో ఆయన నివాసముండే కృష్ణపట్నానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు. అయితే తాజాగా ఆనందయ్యకు ఊహించని షాక్ లు తగిలాయి. ఓవైపు ఆనందయ్య మందు పంపిణీతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందని.. మందు పంపిణీకి అనుమతి ఇవ్వొద్దంటూ కృష్ణపట్నం పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మరోవైపు మందుకు ఉన్న అనుమతి ఏంటి? పంపిణీకి ఎవరు అనుమతిలిచ్చారో చెప్పాలంటూ నెల్లూరు జిల్లా వైద్యాధికారులు నోటీసులు జారీ చేశారు.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు. మందుపంపిణీలో పోలీసుల జోక్యాన్ని అడ్డుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. ఆయుర్వేద మందు కోసం తన దగ్గరకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని దీనిని నివారించాలని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు.

ఆనందయ్య పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది. గతంలోనూ హైకోర్టు సహాయంతో కరోనా మందు పంపిణీకి ఆనందయ్య అనుమతి పొందారు. ఇప్పుడు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఒమిక్రాన్ నివారణ మందు తయారు చేశానని.. దాన్ని ఆనందయ్య పంపిణీ చేస్తున్నారు. ఓవైపు ఈ ఔషధానికి అనుమతులు లేవని ఆయుష్ చెబుతుంటే ఊళ్లో మందు పంపిణీ చేయొద్దంటూ కృష్ణపట్నం వాసులు ఆందోళనకు దిగారు. పంపిణీకి వ్యతిరేకంగా పంచాయతీ తీర్మానం పెట్టారు. గ్రామస్థులు, అధికారుల అడ్డగింతలతో ఆనందయ్య హైకోర్టుకెక్కారు.


Tags:    

Similar News