ప్రపంచాన్ని వణికించిన కరోనా చెట్టుకు పూసిన తాజా పువ్వు ఒమిక్రాన్. దీని లక్షణాల సంగతి ఎలా ఉన్నా.. ఈ మాయరోగం వచ్చిందన్న విషయాన్ని గుర్తించటానికే మూడు.. నాలుగురోజులు పడుతున్న పరిస్థితి. ఇక.. దీని సంగతి తేల్చేందుకు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఎంతకు కొరుకుడుపడని ఒమిక్రాన్ కు సంబంధించి సంచలన ప్రకటన చేశారు నెల్లూరు జిల్లా ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య. తాజాగా ఆయన మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు.
తనకు అవకాశం ఇస్తే.. తన మందుతో 48 గంటల వ్యవధిలో ఒమిక్రాన్ ను ఖతం చేస్తానని ప్రకటించారు. మొన్నటివరకు సౌతాఫ్రికాతో పాటు మరికొన్ని దేశాలకు పరిమితమైన ఒమిక్రాన్.. కొద్ది రోజులుగా దేశంలోనూ ఈ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరి.. ముఖ్యంగా తెలంగాణలో బుధవారం ఒక్కరోజులోనే 15 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు కావటం తెలిసిందే. ఏపీలోనూ కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో తక్కువగా కేసులు నమోదవుతున్న పరిస్థితి.
ఇలాంటివేళ ఆనందయ్య మాట్లాడుతూ.. తాను తయారు చేసిన మందుతో ఒమిక్రాన్ ను కేవలం 48 గంటల్లో ఖతం చేయొచ్చని చెబుతున్నారు. కరోనా వేళ.. తెలుగు రాష్ట్రాల్లో తన నాటు మందుతో పలువురి ప్రాణాల్ని కాపాడిన ఆనందయ్య.. అప్పట్లో పెను సంచలనంగా మారటం తెలిసిందే. ఆయన ఇచ్చే మందు కోసం.. వేలాది మంది ఆయన ఉండే క్రిష్ణపట్నంకు తరలి వెళ్లటం.. వారిని నియంత్రించేందుకుపోలీసులు నానా అవస్థలు పడిన సంగతి తెలిసిందే.
అయితే.. కరోనాకు ఆయన తయారు చేసిన నాటు మందు శాస్త్రీయత మీద ఇంకా లెక్క తేల్లేదు. అయితే.. ఈ మందుతో ఎలాంటి ప్రమాదం లేదని.. ఔషధ రంగానికి చెందిన అధికారులు తేల్చినప్పటికి.. ఈ మందును పలువురు వైద్యులు గుర్తించకపోవటం తెలిసిందే. ఒమిక్రాన్ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి స్పష్టత లేని వేళ.. ఆనందయ్య మాత్రం దానికి తాను మందు తయారు చేశానని చెప్పారు. ఎవరికైనా మందు అవసరమైతే ఆ మందును ఇచ్చేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు.
ఒమిక్రాన్ ను తన మందుతోకేవలం 48 గంటల్లో చెక్ పెట్టొచ్చన్న ఆయన.. భవిష్యత్తులో ఎంతమందికి ఒమిక్రాన్ సోకినా మందు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొన్నారు. ఒమిక్రాన్ బారిన పడిన వారు కానీ.. వారి బంధువులు కానీ తమనుసంప్రదిస్తే ఉచితంగా మందు ఇస్తామని చెబుతున్నారు. శాస్త్రీయంగానే ఒమిక్రాన్ కు ఏ మందు వేయాలో తేల్చుకోలేక కిందా మీదా పడుతున్న వేళ.. ఆనందయ్య మాత్రం అందుకు భిన్నంగా మందు తయారు చేశానని ప్రకటించటం సంచలనంగా మారింది. అయితే.. ఒమిక్రాన్ మీద ఆనందయ్య ప్రకటన ధైర్యాన్ని ఇచ్చేలా ఉందని కొందరు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు మాత్రం ఆయన తొందరపడుతున్నట్లుగా పేర్కొంటున్నారు. గతంలో మాదిరి ఆయేష్.. ఆయన తయారు చేసిన ఒమిక్రాన్ కు చెక్ పెట్టే మందును సేకరించి.. పరిశీలిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ప్రభుత్వం ఆ పని చేస్తుందా? అన్నది చూడాలి.