ఆనంద‌య్య ఒమిక్రాన్ మందు.. మ‌రోసారి వివాదం.. రీజ‌నేంటి?

Update: 2021-12-24 13:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఊపిరి ఆడ‌క వంద‌ల మంది ప్రాణాలు కోల్పోయినం సంగ‌తి తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో త‌న వ‌ద్ద మందు ఉంద‌ని.. దీనిని తీసుకుంటే..ఎలాంటి స‌మ‌స్య ఉండ‌బోద‌ని.. ప్రాణాలు పోతున్నవారిని కూడా లేపి కూర్చోబెడ‌తాన‌ని.. ప‌దే ప‌దేచెప్పిన నెల్లూరుజిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య గుర్తున్నారు క‌దా! అయితే.. అప్ప‌ట్లో ఆనంద‌య్య ఇచ్చిన ఆయుర్వేద మందు విష‌యంలో ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని.. ఆయుష్‌ను రంగంలోకి దింపింది. మూడు వారాలు శోధించి.. దీనికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక‌, చుక్క‌ల మందు విష‌యంలో మాత్రం ఇప్ప‌టికీ సందిగ్థ‌త కొన‌సాగుతోంది.

ఇదిలావుంటే.. అప్ప‌ట్లో అలా ప్ర‌చారంలోకి వ‌చ్చిన ఆనంద‌య్య మందును వైసీపీ నేత‌లే.. త‌యారు చేయించి స్వ‌యం ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేశారు. అయితే..ఇ ప్పుడు మ‌రో వేరియెంట్ ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. అదే ఒమిక్రాన్‌. సాధార‌ణ వేరియంట్ల క‌న్నా.. వెయ్యి రెట్ల వేగంతో ఇది.. దూసుకుపోయి.. ప్ర‌జ‌ల‌కు వ్యాపిస్తోంది. దేశంలో ఇప్పుడు  400  ఒమిక్రాన్ కేసులు ఉన్నాయ‌ని లెక్క‌లు చెబుతున్నాయి. దీనిపై ఇప్ప‌టికీ ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌పంచంలో ఉన్న మేధావులు దీనిపైనే ఎక్కువ‌గా కృషి చేస్తున్నారు. అయితే.. దీనిని కూడా తాను 48 గంట‌ల్లోనే అరిక‌డ‌తానంటూ.. ఆనంద‌య్య మ‌రోసారి ముందుకు వ‌చ్చారు.

ఒమిక్రాన్ వేరియంట్ అయినా, మరే ఇతర ప్రమాదకర వేరియంట్ అయినా తన మందు ముందు తలొంచాల్సిందేనంటారు ఆనందయ్య. ఒమిక్రాన్ మందుతో 48 గంటల్లో దాన్ని పూర్తిగా తగ్గించేస్తానని చెప్పారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఒమిక్రాన్ గురించి ఇంకా వైద్యులకే పూర్తిగా తెలియదు, వారి దగ్గరే సరైన సమాధానం లేదు. అయితే ఆనందయ్య మాత్రం ఒమిక్రాన్ కి మందు కనిపెట్టానంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయుష్ విభాగం ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తోంది. ప్ర‌పంచ‌స్థాయి మేధావుల‌కే ఒమిక్రాన్ అంతు బ‌ట్ట‌డం లేద‌ని ఆనంద‌య్య ఎలా అరిక‌డ‌తార‌నేది.. ఆయుష్ ప్ర‌శ్న‌.

అయితే.. ఆయుష్ విభాగం కమిషనర్ రాములు ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ఆనంద‌య్య మందు విష‌యంలో స్వ‌యంగా ఆయ‌న కానీ.. ప్ర‌భుత్వం నుంచి కానీ.. త‌మ‌కు ఎలాంటి సూచ‌న‌లు అంద‌లేద‌ని.. పేర్కొన్నారు. త‌మ‌కు ప‌రీక్ష‌ల కోసం.. పంపిస్తే.. దానిని ప‌రీక్షిస్తామ‌ని కూడా అంటున్నారు.  ఒమిక్రాన్ కు మందు కనిపెట్టామని ప్రచారం చేసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కానీ, త‌మ‌ను ఆనంద‌య్య సంప్ర‌దించ‌లేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆనంద‌య్య మందుపై మ‌రోసారి వివాదం తెర‌మీదికి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News