మౌనం మామయమైంది. ఒకవైపు వాదన మాత్రమే హైలెట్ అవుతూ.. మిగిలిన వాదనల్ని నొక్కేసేలా దశాబ్దాల పర్యంతం ఒక భావజాలానికి ప్రభావితమైన మీడియాకు భిన్నంగా ఇప్పుడు అన్ని వర్గాల వాదనను సమానంగా వినిపిస్తోంది సోషల్ మీడియా.
49 మంది సెలబ్రిటీలు ప్రధాని మోడీకి లేఖ రాయటం.. జైశ్రీరామ్ అనే నినాదం రెచ్చగొట్టే యుద్ధ నినాదంలా మారిందని.. మూక హత్యలు పెరుగుతున్నట్లుగా ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ లేఖలోని విషయాలు.. వారు ప్రస్తావించిన అంశాలు సంచలనంగా మారాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే యాంటీ నేషనల్.. అర్బన్ నక్సల్ అంటూ ముద్ర వేస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా 49 మంది సెలబ్రిటీలు రాసిన లేఖపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తన పని తాను అన్నట్లుగా ఉంటూ.. కొన్ని సామాజిక అంశాల విషయాల్లో చురుకుగా ఉండే తెలుగు పాటల రచయిత అనంత శ్రీరాం తాజాగా రియాక్ట్ అయ్యారు.
49 మంది ప్రముఖుల లేఖపై ఆయన స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. 49 మంది ప్రముఖుల్ని తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. నకిలీ మేథావులు మళ్లీ సకిలించారంటూ పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.
తాము టేకప్ చేసే ప్రతి అంశానికి సెక్యులర్ మాటను తెస్తూ.. నిజంగా సెక్యులర్ మాటను ప్రస్తావించాల్సిన అంశాల్ని కావాలని మర్చిపోతారన్న ఆరోపణలున్న ప్రముఖులకు షాకిచ్చేలా అనంత శ్రీరాం పోస్టు ఉంది. ఆయన పోస్ట్ చేసిన పోస్ట్ ను యథాతధంగా.. ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా అందిస్తున్నాం. ఆయన వాదనలో ఆగ్రహంతో పాటు.. ఆవేదన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రముఖుల్ని ఇంత పబ్లిక్ గా తప్పు పట్టిన వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకోలేదంటున్నారు.
అనంతశ్రీరాం పెట్టిన పోస్టును చూస్తే..
‘నకిలీ మేధావులు మళ్ళీ సకిలించారు. కుహనా లౌకికవాదులంతా కుమ్మక్కై ప్రధాన మంత్రికి ఉత్తరం రాశారట. అందులో ఏముందయ్యా అంటే "జై శ్రీరాం" అన్న పదం వల్ల ఎన్నో దారుణ మారణ కాండలు జరిగిపోతున్నాయంట. అందువల్ల ఆ పదం వల్ల జరిగే దుష్పరిణామాలు ఆపాల్సిన బాధ్యత ప్రధానమంత్రిదేనట. అంటే ఆ మహాశయులు ఇప్పుడేమంటారు "జై" అన్న పదాన్ని - "శ్రీరాం" అన్న పదాన్ని నిఘంటువుల్లోనించి నిషేధించమంటారా? ఏమో అన్నా అంటారు.
మేథావులు కదా. వాళ్ళు అనేవారలు, మేము వినే వారలము. ఉరుమురిమి ఎక్కడో పడ్డట్టు చిక్కంతా వచ్చి ఇప్పుడు క్రిష్ణా రామా అనుకుంటూ శేష జీవితం ఆనందంగా గడుపుతున్న తల్లిదండ్రులని వచ్చి చుట్టుకుంటుంది. ఎందుకంటే నాపేరు "అనంత శ్రీరాం" ఈ మేధావుల మేధస్సుని అంచనా వెయ్యలేక మా తల్లిదండ్రుల్లానే ఎంతోమంది తమ పిల్లల పేర్లలో రామశబ్ధాన్ని ప్రయోగించారు.
(సీతారాం ఏచూరి గారి నాన్నగారితో సహా ). ఇప్పుడు వాళ్ళంతా మా జనన ధృవీకరణ పత్రాలు మొదలుకుని ఆధార్ల వరకూ మాపేర్లు మార్చే బృహత్తర బాధ్యతని నెత్తినేసుకోవడం ఎలారా నాయనా అని నెత్తీ - నోరు బాదుకోవలసిన పరిస్థితి. అది మరి మేధావి దెబ్బంటే’