అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్ చమన్ సాబ్ పదవికి ముప్పు వాటిల్ల నుందా...ఆయన పదవికి గండం ఉందా అంటే అవుననే సమాధానం జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుడిభుజంగా ఉన్న చమన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఈ టైంలో ఆయన వ్యక్తిగతంగా చాలా కోల్పోయారు. తన కుమార్తెను సైతం పోగొట్టుకున్నారు. చమన్ అజ్ఞాతంలో ఉన్నా కార్యకర్తల్లో ఆయనపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన ఆజ్ఙాతం వీడి బయటకు వచ్చారు. రామగిరి నుంచి జడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో నిలిచారు.
అయితే అదే పోస్టుకు రాయదుర్గం నియోజకవర్గం నుంచి వాల్మీకి సామాజికవర్గానికి చెందిన పూల నాగరాజు కూడా పోటీ పడ్డారు. చమన్ కు పరిటాల సునీత అండదండలు పుష్కలంగా ఉన్నాయి. నాగరాజుకు విప్ కాల్వ శ్రీనివాసులతో పాటు ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి మద్దతు ఉంది. అయితే అప్పట్లో ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన జిల్లా నాయకులు వీరిద్దరు రెండున్నర సంవత్సరాల పాటు జడ్పీ చైర్మన్ పదవిని పంచుకునేలా ఒప్పందం కుదిర్చారు. దీంతో వచ్చే వచ్చే ఏడాది ఆరంభంలో చమన్ తన పదవికి రాజీనామా చేస్తే తర్వాత పూల నాగారాజు జడ్పీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది.
చమన్ పదవికి గండం ఉన్నా ఆయన అనుచరులు మాత్రం తమ నాయకుడు పదవికి రాజీనామా చేసే ప్రశక్తే లేదని తేల్చి చెపుతున్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా చాలా మందికి చమన్ కోట్లలో ఖర్చు చేశాడని ఇప్పుడు ఆయన ఎందుకు రాజీనామా చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. నాగరాజు వర్గం మాత్రం తమకు ఇచ్చిన హామీ మేరకు చమన్ తన పదవికి రాజీనామా చేయకపోతే ఈ విషయం తాము పార్టీ అధిష్టానంతోనే తేల్చుకుంటామని సవాళ్లు చేస్తోంది. జిల్లా నాయకుల సమక్షంలో జరిగిన ఒప్పందం కాబట్టి చమన్ దానికి సమాధానం చెప్పాలని కొందరు నాయకులు వాదిస్తున్నారు. ఏదేమైనా అనంత జడ్పీ చైర్మన్ పీఠం వ్యవహారం టీడీపీలో రెండు గ్రూపుల మధ్య పెద్ద చిచ్చుకు కారణమయ్యేదిగా కనిపిస్తోంది.