ప్రతి విషయంలోనూ పోలిక పెట్టుకోవటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. అందులోనూ ఏపీతో పోలిక అంటే ఆయనకు మహా ఇష్టం. తన సోదర రాష్ట్రంతో పోలిక తెస్తూ.. తమ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని తరచూ ప్రస్తావించే కేసీఆర్.. త్వరలో నీతిఅయోగ్ ప్రకటిస్తుందని చెబుతున్న నివేదిక మీద సమాధానం ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నాణ్యమైన విద్యకు సంబంధించిన త్వరలో దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు సంబంధించి టాప్ 20 జాబితాను నీతి అయోగ్ ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. పాఠశాల స్థాయిలో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే విషయంలో దక్షిణాది రాష్ట్రాలు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని రాష్ట్రాల కంటే మెరుగైన పని తీరును ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు.
స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ ర్యాంకింగ్స్ ను రూపొందించగా.. అందులో 2016-17 నాటి గణాంకాల ఆధారంగా తాజా ర్యాంకింగ్స్ ను డిసైడ్ చేశారు. ఈ ర్యాంకింగ్ లో కేరళ మొదటి స్థానాన్ని సొంతం చేసుకోగా.. రెండో స్థానాన్ని రాజస్థాన్ సొంతం చేసుకోవటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇక.. మూడో స్థానంలో కర్ణాటక ఉంటే నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అనూహ్యంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ మాత్రం 14 ర్యాంకులో నిలవటం చూస్తే.. దీనికి కారణం ఏమిటన్న దానిపై సీఎం కేసీఆర్ ఏమని సమాధానం చెబుతారన్నది ప్రశ్నగా మారటం ఖాయం. అక్షరాస్యతలో ముందున్న కేరళ మొదటిస్థానంలో నిలవటం పెద్ద విషయం కాదు కానీ.. ఏపీ నాలుగో స్థానంలో నిలవటం మాత్రం ఆసక్తికరంగా మారింది.
పాఠశాల విద్యను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తానని తెలంగాన రాష్ట్ర ఆవిర్భావం మొదట్లో ప్రకటనల మీద ప్రకటనలు చేసి హడావుడి చేసిన కేసీఆర్ కు మాత్రం తాజా ర్యాంకింగ్ మింగుడుపడని రీతిలో మారనుందని చెప్పక తప్పదు. అదే సమయంలో.. విభజన తర్వాత రాష్ట్రాల పనితీరు ఆధారంగా ఇచ్చే ర్యాంకింగ్స్ విషయంలో తెలంగాణ వెనుకబడి ఉండటానికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
రాష్ట్రాల వారీగా ర్యాంకుల్నిచూస్తే..
1. కేరళ
2. రాజస్థాన్
3. కర్ణాటక
4. ఆంధ్రప్రదేశ్
5. గుజరాత్
6. అసోం
7. మహారాష్ట్ర
8. తమిళనాడు
9. హిమాచల్ ప్రదేశ్
10. ఉత్తరాఖండ్
11. హర్యానా
12. ఒడిశా
13. ఛత్తీస్ గఢ్
14. తెలంగాణ
15. మధ్యప్రదేశ్
16. జార్ఖండ్
17. బిహార్
18. పంజాబ్
19. జమ్ముకశ్మీర్
20. ఉత్తరప్రదేశ్