ముంచుకొస్తున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న సంగతి తెలిసిందే. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. క్షేత్రస్థాయిలో కార్యచరణతో ముందుకు సాగుతున్నాయి. ఈ ఒరవడిలో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నేతల పాత్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫార్ములా అమలు చేస్తున్న బీజేపీ చేస్తున్న వరుస కార్యక్రమాలతో కాషాయ పార్టీ నేతలు బిజీ బిజీ అయిపోతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలంతా బిజీ అయిపోయే షెడ్యూల్ సిద్ధం అయిందని అంటున్నారు.
క్షేత్ర స్థాయి నుంచి కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ - ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇప్పటికే వారి షెడ్యూలు ఖరారయ్యింది. మరోపక్క ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రజాచైతన్య యాత్ర పేరుతో చేపట్టనున్న రథయాత్రను అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ రథయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఫిబ్రవరి 2 - 3 తేదీల్లో ఒడిసాలో జరిగే ఎస్టీ మోర్చా జాతీయ సమ్మేళనానికి రాష్ట్ర పార్టీ నుంచి ముఖ్యమైన క్యాడర్ హాజరుకానుంది. ఇక ఫిబ్రవరి 3న విజయవాడలో పెద్ద ఎత్తున మేధావులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఫిబ్రవరి 4న కన్నా రథయాత్రను ప్రారంభించిన అనంతరం జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయనగరం - విశాఖ - అరకు - అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల క్లస్టర్ శక్తి కేంద్ర ప్రముఖులతో సమావేశమవుతారు. మరోపక్క విశ్వవిద్యాలయాల స్థాయిలో యువ సంసద్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10వ తేదీ వరకు పార్టీ నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రాల్లో మేధావులతో సమావేశాలు జరుగుతాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఫిబ్రవరి 10న గుంటూరులో ప్రజాచైతన్య సభ జరుగుతుంది. ఈ సభను విజయవంతంచేయడానికి రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షులు జన సమీకరణ చేస్తున్నారు. ఫిబ్రవరి 11న సమర్పణ దివస్ కార్యక్రమాన్ని బూత్ స్థాయిలో జరుపుతారు. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 2 వరకు నా కుటుంబం - బీజేపీ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతీ కార్యకర్త ఇంటిపైన బీజేపీ జెండాను ఎగురవేయాలి. బీజేపీ స్టిక్కర్ ను అంటించాలి. కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు వివరిస్తారు. ఫిబ్రవరి 16న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాచైతన్య సభ రెండోది జరుగుతుంది. ఫిబ్రవరి 16 - 17న పాట్నాలో ఓబీసీ మోర్చ జాతీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ సమ్మేళనానికి రాష్ట్రం నుంచి ఓబీసీకి చెందిన క్యాడర్ పెద్ద ఎత్తున హాజరుకానుంది. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొంటారు. ఫిబ్రవరి 21న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాకినాడ - రాజమండ్రి - అమలాపురం - నరసాపురం - ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల క్లస్టర్ శక్తి కేంద్రాల ప్రముఖుల సమ్మేళనంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు కొవ్వూరుకు చేరుకున్న రథయాత్రకు స్వాగతం పలుకుతారు. ఫిబ్రవరి 23 - 24 తేదీల్లో గోరఖ్ పూర్ లో కిసాన్ మోర్చ జాతీయ సమ్మేళనం - 24న ప్రధాని నరేంద్రమోదీ మన్ కి బాత్-బూత్ స్థాయిలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని క్యాడర్ అంతా ఆలకించి చర్చించాలి.
ఫిబ్రవరి 26న క్లస్టర్ శక్తి కేంద్రాల సమ్మేళనంను ఒంగోలులో ఏర్పాటుచేశారు. మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు - నరసరావుపేట - బాపట్ల - ఒంగోలు - నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని వారితో ఆయన మాట్లాడతారు. ఫిబ్రవరి 26న పోలింగ్ బూత్ స్థాయిలో కమల్ జ్యోతి సంకల్ప కార్యక్రమాన్ని - ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోదీ మండల స్థాయి కార్యకర్తలతో సంభాషిస్తారు. వీటితో పాటు మరిన్ని కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యకర్తను ఎన్నికలకు పనిచేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా ఉన్నప్పటికీ, అదే సమయంలో క్షేత్రస్థాయిలో కేడర్ కు విశ్రాంతి లేకుండా చేశారని అంటున్నారు.