బాబుపై బిజేపీ వార్...

Update: 2018-08-23 11:31 GMT

రాజకీయాలలో ఏదైన సాధ్యమే - కలుపుకుంటారు - విడిపోతారు. అప్పుడే మిత్రపక్షం అంటారు - వెంటనే ప్రతిపక్షం అంటారు. ప్రజల మనోభావాలతో రాజకీయ నాయకులకు పని లేదు. గెలుపే లక్ష్యం. 2014 ఎన్నికలలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని - చంద్రబాబు వంటి నాయకుడు లేడని కితాబిచ్చిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఇప్పుడు చంద్రబాబుని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రచారం కంటే కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు - తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ ఇరుకున పడింది. భోగపురం ఎయిర్ పోర్టు నిర్మణానికి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు వచ్చినప్పటికీ - వారిని కాదని ఆ టెండర్లను, - ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ టెండర్ల రద్దుపై కోర్టును ఆశ్రయిస్తానని ఆయన అన్నారు.

భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. అంతే కాకుండ 53 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆయన పేర్కోన్నారు. పీడీ అకౌంట్లకు సంబంధించి కాగ్ తప్పుపట్టడం కూడా గమనార్హం. ఎదైన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబు నాయుడుకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలు ఒక కొత్త సమస్యను తెచ్చిపెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబు గ్రాఫ్ పడుపోతున్న ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ ఆరోపణలతో చంద్రబాబు నాయుడు అసహనంగా ఉన్నారని వినికిడి. మోదీ సేన చంద్రబాబుపై చాల ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం అందుకే గత నాలుగేళ్లగా చంద్రబాబు  అవినీతి భాగోతాలన్నీ బయపెట్టి, కోర్టుకు ఇడ్చీ కటకటాల వెనుకకు పంపేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.వినికిడి. ఇదే జరిగితే వచ్చే ఎన్నికలలో గెలుపు సరే.......కానీ ఈ ఆరోపణల నుంచి బతికి బట్టకట్టడం ఎలా అన్నట్టుంది చంద్రబాబు పరిస్థితి.
Tags:    

Similar News