ఆన్ లైన్ లో కొనేవేళ.. ధరల చరిత్రను కనుక్కోవటం ఎలా?
పండుగల సీజన్ వచ్చేసింది. ఆఫర్ల సీజన్ ను ప్రకటించేస్తున్నాయి సంస్థలు.
పండుగల సీజన్ వచ్చేసింది. ఆఫర్ల సీజన్ ను ప్రకటించేస్తున్నాయి సంస్థలు. ఆ మాటకు వస్తే.. పండుగల వేళలోనే కాదు.. ఏడాది పొడువునా ఆన్ లైన్ లో ఏదైనా వస్తువును కొనే టైంలో వాటి ధరలను సరిపోల్చటం.. ఎక్కడ తక్కువకు దొరుకుతున్నాయి? కొనే వస్తువుకు పెట్టే ధర ఎంత తక్కువ? మరెంత ఎక్కువ? లాంటి సందేహాల్ని తీర్చే వారెవరు? అన్నది ప్రశ్న. ఇలాంటివి వాటికి కొన్ని ఈ చిట్కాలను పాటిస్తే సరి.
ఆఫర్ల సీజన్ లో కొన్ని సంస్థలు తమ ఉత్పత్తుల ధరల్ని పెంచేసి.. ఆఫర్ల పేరుతో మాయాజాలం చేయటం కనిపిస్తుంది. వాళ్ల ఆఫర్ మీదనే వినియోగదారుడి ఫోకస్ ఉంటుందే తప్పించి.. దాని ధర గతంలో ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? ఎంత తేడా? లాంటి అంశాల మీద మాత్రం పెద్దగా ఫోకస్ చేయరు. అలాంటి సందర్భాల్లో మనం కొనే వస్తువుల ధరల్ని సరసమైన ధరలకు కొంటున్నామా? లేమా? అన్నది క్రాస్ చెక్ చేయటం చాలా అవసరం.
అలాంటి అవగాహనకు ప్రైస్ హిస్టరీ అన్నది చాలా ముఖ్యం. ఒక వస్తువు ధర ఎప్పుడెంత ఉండేది? అన్నది చెక్ చేయటమన్న మాట. ఉదాహరణకు మూడేళ్ల క్రితం ఎంత ఉండేది? ఇప్పుడెంత ఉంది? దాని ధర ఎప్పుడు ఎంతెంత ఉండేది? లాంటి విషయాలు తెలుసుకోవటానికి ఏదైనా టూల్ ఉంటే ఎంతో బాగుంటుంది కదా? ఇప్పుడు చెప్పే కిటుకులతో అలాంటివన్నీ చేసే వీలుంటుంది.
ప్రైస్ హిస్టరీని చెక్ చేయటం కోసం యాప్ బయటకు రావాల్సిన అవసరం లేదు. దీని కోసం కొన్ని యాప్ లను డౌన్ లౌడ్ చేసుకుంటే సరి. ఉదాహరణకు మీ మొబైల్ లో ప్రైస్ హిస్టరీ ఆన్ లైన్ షాపింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ షాపింగ్ ప్లాట్ ఫామ్ లో అయినా కావాల్సిన ప్రొడక్ట్ ను ఓపెన్ చేయటం.. దాని పక్కనే ఉండే షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి.. అంతకుముందే డౌన్ లోడ్ చేసిన యాప్ ను సెలెక్టు చేసుకుంటే సరి. ఆ యాప్ నుంచి బయటకు రాకుండానే అక్కడే ఓ పాప్ అప్ వస్తుంది. అందులో సదరు వస్తువు ధర చరిత్ర అంతా కనిపిస్తుంది.
ఆ వస్తువు గరిష్ఠ ధర ఎంత? కనిష్ఠ ధర ఎంత? ఎప్పుడెప్పుడు ఆ వస్తువు ధర తగ్గింది? పెరిగింది? లాంటి సమాధానాలన్ని శచ్చేస్తాయి. అంతేకాదు.. రానున్న రోజుల్లో ఆ ప్రొడక్టు ధర తగ్గే వీలుందా? అన్నది కూడా ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాదు.. ఇతర ప్లాట్ ఫాంలలో ఎంత ధర ఉందన్న విషయాన్ని కూడా చెప్పేస్తుంది. దీనికి సరిపోల్చి చూడమన్న ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఫలానా వస్తువు ధర ఎంత తగ్గిందన్నది కూడా అలెర్టు అక్కడే సెట్ చేసుకునే వీలుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఆన్ లైన్ లో మీరు కొనే వస్తువుల కోసం ఈ కిటుకుల్ని వాడటం మొదలు పెట్టండి.