అమెజాన్ మీటింగ్స్ లో ఓ ఖాళీ కుర్చీ... బెజోస్ సీక్రెట్ తెలుసా?

అవును... ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎక్కడ మొదలై ఏ స్థాయికి చేరిందనేది దాదాపు అందరికీ తెలిసిన విషయమే.

Update: 2024-09-21 17:30 GMT

వ్యాపారాలు చాలా మంది మొదలు పెడతారు కానీ వారిలో అతి తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతారు.. ఇంకా చాలా తక్కువ మంది మాత్రమే ఆయా రంగాల్లో టాప్ ప్లేస్ లో నిలుస్తారు. అందుకు వారి ఆలోచనా విధానం, పనితీరు తో పాటు ఓ ప్రత్యేకమైన లక్షణం కూడా అందుకు కారణం అని అంటుంటారు. వారి భిన్నమైన ఆలోచనా విధానం అందుకు ప్రధాన కారణం అని చెబుతుంటారు.

ఈ క్రమంలో... 1994లో సీటెల్ లోని ఓ చిన్న గ్యారేజ్ లో స్థాపించిన ఆన్ లైన్ బుక్ స్టోర్, ఈ రోజు 1.96 ట్రిలియన్ల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మారింది అంటే దాని వెనుక ఎంత కృషి ఉండి ఉంటుంది? అంతే కాదు.. ఈ సంస్థ వ్యవస్థాపకుడి విభిన్న ఆలోచనా విధానం, కస్టమర్స్ కోణంలో ఆయన చేసే ఆలోచనలు ఈ సక్సెస్ వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి అని అంటున్నారు.

అవును... ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎక్కడ మొదలై ఏ స్థాయికి చేరిందనేది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ఈ సక్సెస్ లో ఈ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పాత్ర అత్యంత కీలకం. ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూ, సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ నేడు సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ఈయన గురించిన ఓ ఆసక్తికరమైన విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా అమెజాన్ సంస్థకు సంబంధించి జరిగే ప్రతీ సమావేశంలోనూ ఓ కుర్చీని ఖాళీగా ఉంచుతారంట. ఇది బెజోస్ సూచన అని చెబుతుంటారు. దీంతో.. ఆయన ఎందుకు ఇలా చేస్తారు అనే ప్రశ్న అటోమెటిక్ గా తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన సమాధానం ఆశ్చర్యకరంగా ఉంది. ఆ ఖాళీ కుర్చీ కస్టమర్లను గుర్తు చేస్తుందట.

ఇలా ప్రతీ మీటింగ్ లోనూ కస్టమర్లను పరిగణలోకి తీసుకునే నిర్ణయాలు తీసుకోవాలని ఆ ఖాళీ కుర్చీ సూచిస్తుందని బెజోస్ ఆలోచన అని అంటున్నారు. ఫలితంగా... కస్టమర్లకే తొలి ప్రాధాన్యం ఇస్తూ, వారి దీర్ఘకాలిక అంశాలపై దృష్టిపెట్టాలని తన బృందానికి బెజోస్ తరుపున ఈ ఖాళీ కుర్చీ రిమైండర్ గా ఉండేదట.

ఇక ఆ మీటింగ్స్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను బెజోస్ ఏమాత్రం ఎంకరేజ్ చేసేవారు కాదంట. ఈ సమావేశాల్లో పాల్గొనేవారంతా ప్రతీ అంశాన్ని తొలుత చదవాలని.. నిశబ్ధ పఠనం ఏకాగ్రతను పెంచుతుందని ఆయన నమ్మేవారంట. ఇదే సమయంలో... ఇతరుల ముందు మాట్లాడటానికి సంకోచించేవారు కూడా చర్చల్లో పాల్గొనేలా ఈ పఠనం చేస్తుందని బెజోస్ పీపీటీ ప్రజెంటేషన్స్ ను నిషేదించారని అంటారు.

కాగా... అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ 2021లో సీఈవో పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అమెజాన్ ఈవో గా విధులు నిర్వర్తిస్తున్నారు. అమెజాన్ లో తన యాజమాన్య వాటాను 2023 నాటికి 41శాతం నుంచి 10శాతానికి తగ్గించుకున్నారు. ఇక, పోర్బ్స్ నివేదికల ప్రకారం బెజోస్ సంపద 194 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్నారు.

Tags:    

Similar News