ప్రతిపక్ష నేత జగన్ `ప్రజా సంకల్ప యాత్ర`తో ప్రజాక్షేత్రంలోకి వచ్చేశారు. ప్రభుత్వాన్ని ప్రజల మధ్యే నిలదీసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. ఆరు నెలలపాటు పాదయాత్ర, తర్వాత బస్సు యాత్ర ఇలా వచ్చే ఏడాది చివరి వ రకూ జనం మధ్యే ఉండబోతున్నారు. ఇక టీడీపీ కూడా అందుకు తగినట్టే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. మూడున్నరేళ్ల లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు నాయకులు రెడీ అవుతున్నారు. ప్రధాన పార్టీలు ఇలా ఎన్నికలకు సిద్ధ మవుతుంటే బీజేపీ నేతలు ఊరుకుంటారా? ఇప్పుడు వీళ్లు కూడా రంగంలోకి దిగిపోయారు. తామేమీ తక్కువ తినలేదని స్పష్టం చేస్తూనే.. ఇతర పార్టీ నేతలకు సవాల్ విసురుతున్నారు.
విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్ష్ మంత్రం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీలో చేర్చేసిన విషయం తెలిసిందే! రాజీనామాలు కూడా చేయించకుండానే వీరిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టేసింది. దీనిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమోగాని ఆకర్ష్ మంత్రాన్ని బీజేపీ నేతలు పటిస్తున్నారు. దీనిని ఉపయోగించి అసంతృప్తుల కు గేలం వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీలో పొత్తు ఉంటుందో లేదో ఇంకా స్పష్టమైన నిర్ణయం అధిష్టానం నుంచి రాకపోయినా.. భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ నేతలు దృష్టిసారిస్తున్నారు. ఒకవేళ పొత్తు లేకపోతే అప్పటికప్పుడు వ్యూహాలు రచించడం సాధ్యంకాదని గ్రహించిన వీరు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీశారు!
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సి.కె. బాబు బీజేపీలో చేరడంతో చిత్తూరు జిల్లా రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసు కునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదే జిల్లాలో టీడీపీని బలోపేతం చేసేందుకు అధి నేత చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా విజయం సాధించారు. చిత్తూరులో పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఇక ఇదే జిల్లాలో పట్టుకోసం బీజేపీ నేత పురంధేశ్వరి కూడా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ సికె బాబుతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశమైన తర్వాత ఆయన బీజేపీలో చేరేలా ఒప్పించారు.
చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో 2014 ఎన్నికల్లో కైవసం చేసుకుంది టీడీపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది. ఈ తరుణంలోనే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. వీరిని బీజేపీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారట. దీంతో వీరి చేరిక కొంత కాలం వాయిదాపడిందని తెలుస్తోంది! మొత్తానికి రాబోయ రోజుల్లో వీరి మధ్య పోరు మరింత ఎక్కువయ్యే ప్రమాదం లేకపోలేదనేది విశ్లేషకుల అభిప్రాయం!