ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై ప్రజల్లో ఎన్నో అంచనాలున్నాయి.. సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాను గీస్తున్న కొత్త రాజధాని అమరావతి రూపమెలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఇప్పటికే సింగపూర్ మాస్టర్ ప్లాను ఇచ్చిన సంగతి తెలిసిందే.. భూమిపూజా జరిగింది. ఇక నిర్మాణం ప్రారంభించడమే తరువాయి. జపాన్, చైనా, సింగపూర్ దేశాలు రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటాయని భావిస్తున్నారు.
అమరావతి నగరాన్ని ప్రపంచంలోనే అధునాతన నగరంగా నిర్మిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అందరూ దీనికి సంబంధించిన విశేషాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఎక్కడ ఏం నిర్మిస్తారన్నది ఇప్పటికే తెలిసినా ఆయా నిర్మాణాలు ఎలా ఉంటాయి... నిర్మాణం పూర్తయిన తరువాత అమరావతి ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నారు. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం కొత్త రాజధానికి సంబంధించిన పలు ఊహాచిత్రాలు విడుదల చేసింది. తుపాకీ పాఠకుల కోసం అవి అందిస్తున్నాం.