ఆ 4.03 గంటల్లో ఏం జరిగిందంటే?

Update: 2015-10-23 04:40 GMT
అంబరాన్ని అంటే అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఎలా జరిగింది? ఎన్నో అంచనాలు ఉన్న కార్యక్రమంలో ఏమేం జరిగాయి? చరిత్రలో నిలిచిపోయే అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగిన 4.03 గంటల్లో అసలేం జరిగింది. మినిట్ టు మినిట్ గా జరిగిన మొత్తం కార్యక్రమాన్ని చూస్తే..

ఉదయం 10.00 గం ; శంకుస్థాపన కార్యక్రమం మొదలు. వ్యాఖ్యతలు సాయికుమార్.. సునీతలు వేదిక మీదకు రాక

ఉదయం 10.35 గం ; చిన్నారులు.. కళాకారుల చేత కళారూపాల ప్రదర్శన

ఉదయం 10.40 గం ; భవిరి రవి మిమిక్రీ

ఉదయం 10.41 గం ; సినీ హీరో వెంకటేశ్ రాక

ఉదయం 10.55 గం ; సీఎం కుటుంబ సభ్యులు.. హీరో  బాలకృష్ణ రాక

ఉదయం 10.57 గం ; తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక

ఉదయం 11.10 గం ; డ్రమ్మర్ శివమణి వాద్య విన్యాసాలు

మధ్యాహ్నం 12.09 గం ; బాలకృష్ణ ప్రసంగం

మధ్యాహ్నం 12.23 గం ; ప్రధాని మోడీ.. గవర్నర్ నరసింహన్.. సీఎం చంద్రబాబు రాక

మధ్యాహ్నం 12.25 గం ; ప్రధాని ఎగ్జిబిషన్ సందర్శనలో.. బాబు మనమడు దేవాన్ష్ ను ముద్దు చేయటం

మధ్యాహ్నం 12.27 గం ; అమరావతి త్రీడీ నమూనా పరిశీలన. మ్యూజియం వీక్షణం

మధ్యాహ్నం 12.35 గం ; హోమగుండంలో పూర్ణాహుతి సామాను జారవిడచటం

మధ్యాహ్నం 12.43 గం ; శంకుస్థాపన కార్యక్రమంలో శిలాన్యాసం

మధ్యాహ్నం 12.45 గం ; శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరణ

మధ్యాహ్నం 12.48 గం ; వేదిక మీదకు వచ్చిన ప్రధాని.. ఇతర అతిధులు

మధ్యాహ్నం 12.53 గం ; మా తెలుగు తల్లికి మల్లెపూదండ గానాలాపన

మధ్యాహ్నం 12.57 గం ;  ప్రధాని తన వెంట తెచ్చిన పార్లమెంటు పుట్టమన్ను.. యమున నీటి బహుకరణ

మధ్యాహ్నం 12.59 గం ; జపాన్ మంత్రి సుమితొమి ప్రసంగం

మధ్యాహ్నం 01.04 గం ; సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం

మధ్యాహ్నం 01.08 గం ; తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం

మధ్యాహ్నం 01.11 గం ; కేంద్రమంత్రి వెంకయ్య ప్రసంగం

మధ్యాహ్నం 01.16 గం ; ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం

మధ్యాహ్నం 01.37 గం ; ప్రధాని మోడీ ప్రసంగం

మధ్యాహ్నం 02.01 గం ; పూర్తి అయిన మోడీ ప్రసంగం

మధ్యాహ్నం 02.02 గం ; ఐక్యతా ఫోటో

మధ్యాహ్నం 02.03 గం ; వేదిక నుంచి మోడీ నిష్క్రమణ

Tags:    

Similar News