దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎంలలో జగన్..ఎన్నో ర్యాంకంటే?

Update: 2020-06-03 04:00 GMT
వైఎస్ జగన్ అద్భుత ఘనత సాధించారు. ఏపీ సీఎంగా గద్దెనెక్కిన సంవత్సరంలోనే ఈ ఘనత సాధించడం విశేషంగా మారింది. తాజాగా సీ-ఓటర్-టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భారత దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితాలో 4వ స్థానంలో నిలిచారు.

సీఓటర్-టైమ్స్ ఆఫ్ ఇండియా జాబితాలో దేశంలోనే అత్యంత పాపులర్ సీఎంగా 82.96శాతం ఓటింగ్ తో మొదటి స్థానాన్నిఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత వరుసగా చత్తీస్ ఘడ్ సీఎం(81.06) 2వ స్థానాన్ని.. కేరళ సీఎం(80.28) మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వరుసగా నాలుగో సారి ఆ రాష్ట్ర సీఎంగా గెలిచారు. ప్రజల్లో ఆయనపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది.  అందుకే అత్యధికులు ఆయనకే ఓట్ వేయడంతో దేశంలోనే పాపులర్ సీఎంగా అవతరించారు.

ఇక చత్తీస్ ఘడ్ సీఎం భూపెన్ భగెల్ తన రాష్ట్రంలో భారీగా ప్రజల ఆమోదంతో గెలిచి బలమైన నాయకుడిగా గుర్తింపు పొందరాు.

కేరళ సీఎం పినరయి విజయన్ రాష్ట్రంలో కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా పెద్ద స్కోర్ సాధించి దేశంలోనే పాపులర్ సీఎంగా 3వ స్థానంలో నిలిచారు.

ఇక నాలుగో స్థానంలో ఏపీ సీఎం జగన్ 78.01శాతంతో 4వ స్థానంలో నిలవడం విశేషం. ఎలాంటి పరిపాలన అనుభవం లేకున్నా.. సీఎం జగన్ మొదటి ఏడాదిలోనే అద్భుతాలు సృష్టించాడు. సంక్షేమాన్ని పరుగులు పెట్టించాడు. దాదాపు ఏడాది పాలనలో 90శాతం హామీలు అమలు చేసి దేశంలోనే సంక్షేమ రాజ్యాన్ని ఏపీలో నెలకొల్పారు.ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గత ఎన్నికల్లో అత్యధిక శాతం ప్రజల ఆమోదంతో మద్దతుతో  ఏకంగా 151 సీట్లు సాధించి ప్రజా మోదం పొందారు. పాపులర్ సీఎంగా నిలిచారు. ఏపీ జనాభాలో ఎక్కువ భాగం వైఎస్ జగన్ నాయకత్వాన్ని ప్రశంసించారు.

ఈ సర్వేలో ప్రజల అభిప్రాయాలతోపాటు సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాస్తవాలను క్రాస్ చెక్ చేసుకున్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి వెళ్లిన వలస కార్మికులను చాలా జాగ్రత్తగా చూసుకొని ఆయా రాష్ట్రాల్లోకి జాగ్రత్తగా సీఎం జగన్ తరలించడం చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ఏపీలోని వలస కార్మికులను ఉంచిన షెల్టర్ లలో అందించే సౌకర్యాలు దేశంలోనే ఉత్తమమైనవిగా వలస కార్మికులు పేర్కొన్నారు. కొంతమంది రైళ్లలో ప్రయాణించిన వారికి నాణ్యమైన ఆహారం, సౌకర్యాలను ఉచితంగా సీఎం జగన్ అందించి వారి నుంచి భారీ ప్రశంసలను అందుకున్నారు. ఆయనను దేశంలోనే పాపులర్ సీఎం జాబితాలో చేర్చారు. 
Tags:    

Similar News