తెలంగాణ విరామం: ఆంధ్రా వైద్యులు సమ్మెలోకి!

Update: 2021-06-01 14:08 GMT
కరోనా కల్లోలం వేళ వైద్యులు చేస్తున్న సమ్మెతో రోగుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే తెలంగాణ సర్కార్ ముందే అప్రమత్తమై వైద్యుల కోరికలు తీర్చి జీతాలు పెంచింది. వారి చెప్పిందానికల్లా తలూపింది. అయితే తెలంగాణలో వైద్యుల సమ్మె ఇలా ముగిసిందో లేదో ఆంధ్రాలో వైద్యులు అందుకున్నారు.

తెలంగాణలో జూనియర్ -సీనియర్ రెసిడెంట్ వైద్యులు 15 శాతం వేతన పెంపు తోపాటు వారి ఇతర డిమాండ్లను పరిష్కరించిన తరువాత వారి సమ్మెను విరమించుకున్న వారంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వారి సహచరులు సమ్మెను ప్రారంభించారు. మంగళవారం నుంచి ఆంధ్రాలోని 1,000 మందికి పైగా జూనియర్ వైద్యులు రాష్ట్రంలోని ఆసుపత్రులలో తమ విధులను బహిష్కరించారు, ఏపీ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైతే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలలోనూ బంద్ పాటిస్తామని డిమాండ్ చేస్తున్నారు.

వీరు చేస్తున్న ప్రధాన డిమాండ్లలో వారిని సీనియర్ డాక్టర్లుగా పర్మినెంట్ గా గుర్తించడం.. వారి స్టైఫండ్ పెంచడం వంటివి ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల చివరి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులందరినీ సీనియర్ డాక్టర్లుగా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీజుడా) కోరింది. ఈ విద్యార్థులంతా కరోనావైరస్ వార్డులలో కూడా విధులు నిర్వర్తిస్తున్నారని అసోసియేషన్ అభిప్రాయపడింది. సీనియర్ డాక్టర్ల స్టైఫండ్‌ను ఆలస్యం చేయకుండా రూ.80,000కు పెంచాలని.. ఈ డిమాండ్ 2020 జనవరి నుండి పెండింగ్‌లో ఉందని వాళ్లు ఎత్తి చూపారు.కోవిడ్ -19 విధులు చేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలు, కోవిడ్ విధుల తర్వాత వారికి క్వారంటైన్ సౌకర్యం కూడా కల్పించాలని వారు కోరారు.

వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ వారి డిమాండ్లను సానుభూతితో పరిగణించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  మేము వారి సమస్యలను ఒక వారంలోనే పరిష్కరిస్తామని.. వారి సమ్మెను విరమించుకోవాలని వైద్యులకు విజ్ఞప్తి చేస్తాము.
Tags:    

Similar News