కొందరికి అవకాశాలు వస్తుంటాయి. మరికొందరు అంది వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. మరికొందరు.. వచ్చిన గోరంత అవకాశాన్ని కొండంతలు చేసి చెప్పుకుంటుంటారు. ఆ కోవలోకే వస్తారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పాలన మీద కంటే ప్రచారం మీదనే ఆయన ఫోకస్ ఎక్కువగా ఉంటుందన్న విమర్శ.. తరచూ ఆయన్ను ఉద్దేశించి వినిపిస్తూఉంటుంది. ప్రచారంతోనే పాలన జెట్ స్పీడ్ లో సాగుతున్న భ్రమల్ని కల్పించటంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే.. ఆయన పాలన ఉండటం కనిపిస్తుంటుంది.
గడిచిన ఆరునెలల వ్యవధిలో..పాలనలో చంద్రబాబు ఏం ముద్ర వేశారు? అభివృద్ధికి సహకరించే ఎలాంటి నిర్ణయాల్ని తీసుకున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తే.. ఇట్టే గుర్తుకొచ్చే అంశాలంటూ ఏమీ కనిపించవు. అదే సమయంలో.. ప్రచారం కోసం బాబు ఏమేం కార్యక్రమాలు చేపట్టారన్న ప్రశ్న వేసిన వెంటనే.. పలు కార్యక్రమాల జాబితాను పలువురు ఇట్టే చెప్పేస్తారు.
తాజాగా ఏపీ సర్కారుకు సీఎన్ బీసీ టీవీ 18 సంస్థ అందించే ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డు ఏపీకి దక్కింది. బ్యాకింగ్.. పారిశ్రామికరంగాలకు చెందిన జాతీయ స్థాయి ప్రముఖులతో కూడి జ్యూరీ ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేసినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారాన్నిమొదలెట్టేసింది బాబు బ్యాచ్. వచ్చే నెల 23న జరిగే అవార్డు ప్రదానోత్సవానికి ముందు నుంచే.. ఈ అవార్డు గురించి భారీగా ప్రచారం చేసుకోవాలన్న ప్రయత్నాలు మొదలైనట్లుగా తెలుస్తోంది.
వివిధ రంగాల్లో సాధించిన విజయాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలకు.. సంస్థలకు.. వ్యక్తులకు సీఎన్ బీసీ టీవీ సంస్థ ఏటా పురస్కారాల్ని అందిస్తుంటుంది. అయితే.. ఈ అవార్డును ఏ గ్లోబల్ సంస్థో ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్న బాబు బ్యాచ్ పైన పలువురు విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెడుతున్నారు. ఒక మీడియా సంస్థ ఇచ్చే అవార్డును ఇంత ఘనంగా చెప్పుకోవటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
మరో కీలకమైన అంశం ఏమిటంటే.. అవార్డు ప్రకటించిన మీడియా సంస్థ.. బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే మీడియా సంస్థకు మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అలా అని అవార్డును తక్కువ చేసి చెప్పటం లేదు కానీ.. బాబు బ్యాచ్ ప్రచారం చేసుకుంటున్న స్థాయిలో మాత్రం లేదన్న మాట వినిపిస్తోంది. తాజా అవార్డు పుణ్యమా అని మరో ఏడాది పాటు ప్రచారం చేసుకోవటానికి బాబుకు అవకాశాన్ని ఇచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవార్డులు స్ఫూర్తిని ఇవ్వాలే కానీ.. గొప్పలు చెప్పుకునేవిగా ఉండకూడదన్న విమర్శకుల మాటలోని సత్యాన్ని బాబు బ్యాచ్ గుర్తిస్తే బాగుంటుంది
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/