కరోనా ఎఫెక్ట్ : ఏపీలో నియోజకవర్గానికో ఐసోలేషన్ వార్డ్..

Update: 2020-03-23 13:15 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో... ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఏపీలో ఇప్పటివరకు 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్ రాగా, అతడు కరోనా నుండి కోలుకున్నాడు. ఇకపోతే కరోనా వైరస్ భారత్ లో వ్యాప్తి చెందిన తరువాత విదేశాల నుండి 13, 301 మంది వచ్చారు. వారిలో  స్వీయ నియంత్రణ లో ఉన్నవారు 11,206  - 2222 మందికి హోమ్ ఐసోలేషన్ పూర్తయింది. అలాగే  11026 మంది ఇంకా ఐసోలేషన్ లో ఉన్నారు.

ఇక రాష్ట్రంలో  కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి ఓ 100 పడకల ఐసోలేషన్‌  క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల కరోనా  చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అలాగే 108 సిబ్బందికి అవసరమైన పరికరాలు - వస్తువులు అందించడంతో పాటు వారికి మనోధైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మీ చుట్టుపక్కల ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే 104 నెంబర్ కి తక్షణం కాల్ చేసి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తక్కవగా ఉందని - ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.

ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తే కరోనాను నియంత్రించగలమని - రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరైనా నిత్యవసర వస్తువుల ధరలు పెంచినా - బ్లాక్ మార్కెటింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని మంత్రి నాని హెచ్చరించారు. అలాగే కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలని మంత్రి నాని కోరారు. ఇక ఇదే సమయంలో పేదలకు ఇబ్బంది కలగకుండా ఆదుకునేందుకు ప్రతి ఇంటికి రూ.వెయ్యి రూపాయలతో పాటు ఉచితంగా రేషన్ - కిలో పప్పు సరఫరా చేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
Tags:    

Similar News