నవ్యాంధ్రప్రదేశ్ లో నవతరం పాలన సాగిస్తానంటూ తానిచ్చిన హామీ మేరకు ప్రజలు తనకు కట్టబెట్టిన అధికారాన్ని వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టేందుకే అంకితం చేసినట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నాటి సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టగా... మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అగ్రి బడ్జెట్ మొత్తం అన్నదాతల సంక్షేమమే పరమావధిగా సాగింది.
ఏదో రైతులకు ఇలా రుణాలిచ్చాం - అలా చేశామన్న తీరులో కాకుండా సాగును లాభసాటిగా చేయాలంటే ఏమేం కావాలో వాటన్నింటిపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా జగన్ ప్రభుత్వ వ్యవసాయ బడ్జెట్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి సరికొత్త ఊతమివ్వడంతో పాటు అన్నదాతలకు కష్టాలను దూరం చేసేదిగా సాగిన ఈ బడ్జెట్ ద్వారా అన్నదాతలకు జగన్ సర్కారు పెద్ద ఎత్తున వరాలను ప్రకటించింది.
పులివెందులలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన జగన్ సర్కారు... ఎరువులు - పురుగు మందులు - విత్తనాలకు నాణ్యమైన పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. బొత్స ప్రవేశపెట్టిన అగ్రి బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
- రెవెన్యూ వ్యయం రూ. 27,946.65 కోట్లు
- పెట్టుబడి వ్యయం రూ. 919.58 కోట్లు
- వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రూ.3,223 కోట్లు
- రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ. 4,525 కోట్లు
- ధరల స్థిరీకరణ నిధికి రూ. 3వేల కోట్లు
- ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు
- వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు రూ. 1163 కోట్లు
- వైఎస్సార్ రైతు బీమాకు రూ. 100 కోట్లు
- ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రూ. 7 లక్షల సాయం
- ఉద్యాన శాఖకు రూ.1532 కోట్లు
- ఆయిల్ ఫాం ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు రూ. 80 కోట్లు
- ఆయిల్ ఫాం తోటల సాగు ప్రోత్సాహకానికి రూ.65.15 కోట్లు
- ఉద్యాన పంటల సమగ్రాభివృద్ధికి రూ. 200 కోట్లు
- బిందు - తుంపర సేద్య పథకాలకు రూ. 1105.66 కోట్లు
- సహకార రంగ అభివృద్ధి కోసం రెవెన్యూ వ్యయం రూ.174.64 కోట్లు
- సహకార రంగ అభివృద్ధి కోసం పెట్టుబడి వ్యయం రూ. 60 కోట్లు
- ప్రతి రైతు కుటుంబానికి వైఎస్సార్ భరోసా కింద రూ. 12,500
- 2019-20లో రైతులకు స్వల్పకాలిక రుణాల కింద రూ. 12 వేల కోట్లు
- 2019-20లో రైతులకు దీర్ఘ కాలిక రుణాల కింద రూ.1500 కోట్లు
- పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.158 కోట్లు
- పశు సంవర్ధక శాఖ అభివృద్ధికి రూ.1778 కోట్లు
- పాడి పరిశ్రమకు రూ. 100 కోట్లు
- గొర్రెల బీమా పథకం కింద గొర్రె మరణిస్తే రూ. 6 వేలు
- పశువు మరణిస్తే బీమా పథకం కింద రూ. 30 వేలు
- పశుగ్రాసం కోసం రూ. 100 కోట్లు
- పశు టీకాల కోసం రూ. 25 కోట్లు
- కోళ్ల పరిశ్రమ నిర్వాహకుల కోసం రూ. 50 కోట్లు
- నిషేధ సమయంలో మత్స్యకారుల భృతి రూ. 10 వేలకు పెంపు
- వేటకు వెళ్లి మత్స్యకారులు చనిపోతే కుటుంబానికి రూ.10 లక్షలు
- ఆహార భద్రత మిషన్ కు రూ.141 కోట్లు
- వ్యవసాయ మౌలిక వసతులకు రూ. 349 కోట్లు
- రైతులకు రాయితీ విత్తనాల కోసం రూ.200 కోట్లు
- భూసార పరీక్షల నిర్వహణకు రూ. 30 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణ రూ. 420 కోట్లు
- జీరో బడ్జెట్ వ్యవసాయానికి రూ.91 కోట్లు