పదేళ్లు హైదరాబాద్‌లో ఉండాలని చెప్పారేంటి?

Update: 2015-04-10 13:00 GMT
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు సంబందించి హైకోర్టు ధర్మాసనం ముందు తాజాగా ఏపీ సర్కారు తన వాదనను వినిపించింది. ఇప్పటివరకూ చెబుతున్న మాటలకు భిన్నమైన వాదనను వినిపించటం గమనారÛం.

విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ పదేళ్లు ఉండే అవకాశం ఉన్నందున.. ఇక్కడే హైకోర్టు ఉండాల్సిన అవసరం ఉందని కోర్టుకు స్పష్టం చేయటం తాజాగా చర్చకు తావిస్తోంది.

ఎపీలో హైకోర్టును ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు భిన్నంగా ఏపీ సర్కారు. .ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేసినా తమకు ఇబ్బంది లేదని చెప్పటం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏపీ రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో.. ఏపీ హైకోర్టు ఏపీలో ఏర్పాటు చేయిస్తే మంచిదన్న భావన సీమాంధ్రులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి భిన్నంగా హైకోర్టును హైదరాబాద్‌లో పదేళ్లు ఉండొచ్చు కదా అన్న వాదనను వినిపించటం గమనారÛం.

ఏపీ రాష్ట్ర పరిపాలనా విభాగం.. అసెంబ్లీ.. సెక్రటేరియట్‌ హైదరాబాద్‌లోనే ఉన్నందున హైకోర్టు ఎందుకు ఉండకూదని ఏపీ ప్రభుత్వం తన వాదనను వినిపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు.. కేంద్ర ప్రభుత్వం తమ వాదనలను లిఖితపూర్వకంగా ఇవ్వాలంటూ పేర్కొంటూ కేసును బుధవారానికి వాయిదా వేశారు. మొత్తానికి ఏపీ హైకోర్టును హైదరాబాద్‌ నుంచి మార్చే ఉద్దేశ్యంలో చంద్రబాబు సర్కారు లేనట్లు ఉందన్నసందేహాలు తాజా వాదనతో బలపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.



Tags:    

Similar News