తుని విధ్వంసానికి పాల్పడిన నిందితుల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. పోలీసుల చర్యకు నిరసనగా కాపు నేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన నాలుగు రోజులుగా (తాజాగా ఐదో రోజు నడుస్తోంది) పట్టు విడవకుండా దీక్ష చేస్తున్న ఆయన వైఖరితో ఏపీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇంత ఒత్తిడిలోనూ తుని విధ్వంసం వ్యవహారంలో బాధ్యులైన వారి విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించటం గమనార్హం.
గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో (ముద్రగడ దీక్ష ప్రారంభించిన రోజు నుంచి) తుని విధ్వంసంతో సంబంధం ఉందంటూ పలువురిని అరెస్ట్ చేయటం గమనార్హం. తాజాగా ప్రభుత్వ వైఖరి చూస్తుంటే.. తుని విధ్వంసం విషయంలో రాజీ పడేది లేదన్నట్లుగా ఏపీ సర్కారు తీరు ఉన్నట్లు కనిపిస్తోంది. విధ్వంసం చేసిన వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని.. నేరం చేసిన వారి విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉందన్న కఠిన సందేశాన్ని పంపించాలన్న ఉద్దేశంతోనే తాజా అరెస్ట్ లు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరీ అరెస్ట్ లు ఉద్రిక్తతల్ని మరింత పెంచుతాయా? లేక.. తగ్గుతాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.