గోదావరి పుష్కరాల సందర్భంగా.. ముగింపు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తామని ఏపీ సర్కారు పేర్కొంటోంది. ముగింపు ఉత్సవాల సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను పర్యవేక్షణలో ఏర్పాట్లు చేయటం తెలిసిందే.
ఘనంగా ఏర్పాట్లు చేయటం తప్పు కాదు. భారీతనం ఉట్టిపడేలా కసరత్తు చేయటం ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ.. షోకుల కన్నా కూడా.. ప్రజల ప్రాణాలు చాలా కీలకం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. భారీగా ఉండాలని.. అద్భుతం అనుకునేలా చేయాలన్న తపన అమాయక ప్రజల ప్రాణాలు పోయేలా చేయకూడదు.
గోదావరి పుష్కరాల సందర్భంగా తొలి రోజు జరిగిన తొక్కిసలాటే దీనికి నిదర్శనం. 27 మంది (కొన్న మీడియా సంస్థలు 29 చెబుతున్నాయి. కానీ 27 తొక్కిసలాటలో చనిపోయిన వారు. మరో ఇద్దరు తొక్కిసలాట జరిగిన రోజు చనిపోయినా.. వారికి తొక్కిసలాటకు ఏ మాత్రం సంబంధం లేదు) ప్రాణాలు బలికొన్న విషయాన్ని మర్చిపోకూడదు.
తొక్కిసలాట సందర్భంగా.. బోయపాటి డైరెక్షన్ కారణంగా.. బాబు గంటల తరబడి ఉన్నారని.. ఒక అంతర్జాతీయ ఛానల్ షూటింగ్ కోసం ఈ తతంగమంతా జరిగిందని.. దీంతో.. భక్తుల రద్దీ పెరిగి.. తొక్కిసలాటకు కారణం అయ్యిందన్న విమర్శలు చోటు చేసుకోవటం.. దాన్ని ఖండిస్తూ బోయపాటి వివరణ ఇవ్వటం తెలిసిందే. విమర్శలు వచ్చిన బోయపాటి చేతనే మరోసారి పుష్కర ముగింపు ఏర్పాట్లు చేయటం గమనార్హం.
అందరిని ఆకట్టుకునేలా.. అందరూ శభాష్ అనేలా పనులు చేయటం తప్పేం కాదు. కానీ.. భారీగా ఉండాలని.. అదిరిపోయేలా ఏర్పాట్లు ఉండాలన్న తపనతో.. అమాయక ప్రజల ప్రాణాల గురించి..వారి భద్రత గురించి తగిన ఏర్పాట్లు చేయకపోవటం దారుణమన్న విషయం మర్చిపోకూడదు. అందుకే.. అదరగొట్టే ఏర్పాట్లతో పాటు.. ఎలాంటి ఘటన జరిగినా.. ఎవరి ప్రాణాలకు ఏం కాకుండా ఉండేలా.. దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలన్న విషయాన్ని ఏపీ సర్కారు మర్చిపోకుండా ఉండే బాగుంటుంది.