ప్రతిష్ఠాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచింది! అయితే, ఈ గెలుపు ఊరికే రాలేదని ఇటీవల సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. అంటే.. అందరూ బాగా కష్టపడ్డారని అందరూ అనుకున్నారు. కానీ, నంద్యాలలో విజయం సాధించడం వెనుక ప్రభుత్వ పరంగా ఎంత కుట్ర జరిగిందో? ఎంత ప్రజా ధనం లూటీ అయిందో ఇప్పుడు తెలిసిపోయింది. ప్రజా ధనాన్ని తన జేబులో డబ్బు మాదిరిగా చంద్రబాబు నంద్యాలలో పారించేశారు. అనేకమైన ప్రాజెక్టులు ప్రారంభించి కూడా ఏ ఒక్క దానికీ కేటాయించని స్థాయిలో నంద్యాల ఉప పోరుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో డబ్బు వెదజల్లారు.
ఇదే విషయాన్ని బాధ్యతాయుత విపక్షంగా వైసీపీ ఆరోజే వెల్లడిస్తే.. కిట్టక మాపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ మందీ మార్బలం ఆడిపోసుకుంది. కానీ, నేడు.. రుజువులు, సాక్ష్యాలతో ప్రభుత్వం నంద్యాలలో నిస్సిగ్గుగా వ్యవహరించిన తీరు స్పష్టమైంది. ప్రభుత్వం తాజాగా రూ.576.62 కోట్లకు సంబంధించి మంగళవారం రహస్య జీవోను జారీ చేసింది. సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ మంత్రిగా ఉన్న గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి ఈ జీవో జారీ కావడం గమనార్హం. 608 వ నెంబరుతో వచ్చిన ఈ జీవోలో రూ.576.62 కోట్ల మేరకు నిధులు విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
అయితే, ఈ నిధులు ఏ పనుల నిమిత్తం విడుదల చేశారనే వివరాలను పేర్కొనాల్సిన చోట ఖాళీగా ఉంచి అందులో ‘కాన్ఫిడెన్షియల్( రహస్యం)’ అని రాశారు. దీనిని బట్టి లోపాయికారీగా ఏదో జరుగుతోందనేది ధ్రువపడుతోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించిన జీవోగా దీనిని కొందరు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఉప ఎన్నిక నేపథ్యంలో కేవలం నంద్యాల నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు మాత్రమే ప్రభుత్వం నిధులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఆ నిధులకు సంబంధించే ప్రభుత్వం రహస్య జీవో విడుదల చేసిందని సమాచారం. ఏదేమైనా.. నంద్యాల ఉప ఎన్నికలో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందనేది వాస్తవం.