ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ఎయిర్‌పోర్ట్ కొంటోందా? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలోని సాయిబాబా ఆశ్రమం నిర్వహించే విమానాశ్రయాన్ని ఏపీ సర్కారు కొనుగోలు చేయనుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
సత్యసాయి బతికి ఉన్న సమయంలో దేశ.. విదేశాల నుంచి తరచూ ప్రముఖులు వచ్చి పోతుండేవారు. రాకపోకలు ఎక్కువగా ఉండేవి. కానీ.. ఆయన అనంతలోకాలకు వెళ్లిపోయిన తర్వాత పుట్టపర్తికి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో ఎయిర్‌పోర్ట్ నిర్వహణ ఆశ్రమానికి కష్టంగా మారింది. దాదాపు 450ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్‌ని ఏపీ సర్కారు కొనుగోలు చేయాలని భావిస్తోంది.
ఏపీలో విమానాశ్రయాల్ని వీలైనన్ని ఎక్కువగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉన్న సర్కారు.. పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌ని కొనుగోలు చేసి... పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాల్లోకి విస్తరించటం ద్వారా.. వీలైనంత త్వరగా మరో ఎయిర్‌పోర్ట్‌ని అందుబాటులోకి తీసుకురావచ్చన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న ఈ వ్యవహారం.. కార్యరూపం దాలిస్తే.. చాలా త్వరగానే మరో ఎయిర్‌పోర్ట్ ఏపీ ఖాతాలోకి వచ్చి చేరుతుందని చెబుతున్నారు. మరి.. ఈ విషయంలో బాబు సర్కారు ఎంత వేగంగా స్పందిస్తుందో చూడాలి.