బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ!

Update: 2020-04-15 07:50 GMT
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు లో మరో ఎదురుదెబ్బ. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో 81 - 85ను ఏపీ హైకోర్టు తాజాగా కొట్టేసింది. పాఠశాలల్లో ఏ మీడియం చదవాలనేది పిల్లలు - తల్లిదండ్రులు నిర్ణయిస్తారని పిటిషనర్ తరపున లాయర్ వాదించారు. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తే బ్యాక్‌ లాగ్‌ లు మిగిలిపోతాయని  - బలవంతంగా ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఇబ్బందులు ఉన్నాయని లాయర్ ఇంద్రనీల్ కోర్టు దృష్టితీసుకెళ్లారు.

కాగా, ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు... దీనికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు  అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం కొనసాగిస్తూనే .. ఇంగ్లీష్ మీడియం ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం సర్కార్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.

భవిష్యత్తులో మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని తమ వాదనని ప్రభుత్వం సమర్ధించుకుంది. ఇక,  తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేయడంతో - ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News