వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌కు షాక్‌: ‌లాక్‌ డౌన్ ఉల్లంఘించార‌ని నోటీసులు

Update: 2020-05-05 07:50 GMT
లాక్‌ డౌన్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఎంత‌వారైన కానీ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే కేసులు న‌మోదు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కొంద‌రు ఎమ్మెల్యేలు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ క్ర‌మంలో విచార‌ణకు స్వీక‌రించిన హైకోర్టు ఈ సంద‌ర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

లాక్‌ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ వారిపై హైకోర్టులో పిటిషన్ దాఖ‌లైంది. ఈ క్ర‌మంలో ఆ పిటిష‌న్‌ పై న్యాయ‌స్థానం విచార‌ణ చేసింది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో ఏపీఐఐసీ చైర్‌ ప‌ర్స‌న్‌ - న‌గ‌రి ఎమ్మెల్యే రోజా - చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడదల రజని - శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి - సుళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య - ప‌ల‌మనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ్ ఉన్నారు. కరోనా వైర‌స్ వ్యాప్తికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు - నాయ‌కులే కారణమని హైకోర్టు లో పిటిషన్ దాఖలైన విష‌యం తెలిసిందే.

ఆ పిటిష‌న్‌ పై న్యాయవాది ఇంద్రనీల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. విచార‌ణ‌లో భాగంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని - డీజీపీని హైకోర్టు ఆదేశించింది.
Tags:    

Similar News