వీడియోకాల్ తో భార్యకు బెదిరింపు.. నిజంగానే చనిపోయాడు

Update: 2020-05-06 14:30 GMT
కువైట్ లో పని చేస్తున్న భార్యను ఎలాగైనా తన దగ్గరకు తీసుకురావాలని ఆ భర్త ప్లాన్ చేశాడు. వీడియో కాల్ చేసి ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్టు బెదిరించాడు. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. నిజంగానే ఉరిపడింది. భార్యను బెదిరించాలనుకున్న వ్యక్తికి నిజంగానే ఉరిపడి ప్రాణాలు పోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తల్లాపుడి మండలం మలకపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

మలకపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (35) భార్య కువైట్ లో పనిచేస్తోంది. ఆమెను స్వదేశానికి తిరిగిరావాలని చాలా రోజులుగా భర్త కోరుతున్నాడు. ఆమె రాకపోవడంతో పథకం పన్నాడు. ఆమెకు వీడియో కాల్ చేసి నువ్వు రాకపోతే చస్తానని ఉరికొయ్యకు వేలాడుతూ నటించాడు. వీడియో కాల్ సమయంలోనే వారిద్దరికి గొడవ జరిగింది. తిరిగి స్వదేశానికి రావడానికి ససేమిరా అన్న భర్యతో భర్త గొడవపడ్డాడు. చచ్చిపోతానని బెదిరించాడు. మంచం మీద నిలబడి మెడకు ఉరితాడును వేసుకొని ఆమెను బెదిరించాడు. వాదన సందర్భంగా  జారిపడి ఉరి బిగుసుకుపోయింది. దీంతో ప్రాణాలు కోల్పోయాడు. భార్యను బెదిరించాలని చేసిన ప్రయత్నంలో నిజంగానే ఉరిపడి ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.

పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి బాధితుడి రూం చెక్ చేయగా.. చనిపోవడానికి ముందు మొబైల్ ఫోన్ లో వీడియో కాల్ చేసినట్టు గుర్తించారు. దంపతుల మధ్య సంభాషణ జరిగినట్టు దర్యాప్తులో తేలింది.  

వీడియో కాల్ తో ఉసురు తీసుకోవడం ఇన్నాళ్లు చూసినప్పటికీ ఇలా బెదిరిస్తూ నిజంగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు పోయిన సంఘటన అరుదనే చెప్పాలి. భార్యను బెదిరించాలని నిజంగానే ప్రాణాలు పోగొట్టుకోవడం స్థానికంగా విషాదం నింపింది.
Tags:    

Similar News