అధినేత చంద్రబాబు మనసు దోచుకునేందుకు తెలుగు ఎమ్మెల్సీ తమ్ముళ్లు చేసిన ఒక ప్రయత్నం పలువురి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. వారి ఐడియాను చూసిన ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు తమకెందుకీ ఆలోచన రాలేదని ఫీలైన పరిస్థితి. కృష్ణా పుష్కరాల్ని సూపర్ సక్సెస్ చేసేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగా శ్రమించారో తెలిసిందే.
పుష్కరానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ.. ఎక్కడా ఎలాంటి లోపం జరగకుండా ఉండేలా చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తలు అన్నీఇన్నీ కావు. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా ఆయన విపరీతంగా శ్రమించారు. ఆయన పడిన కష్టానికి ఫలితం అన్నట్లుగా కృష్ణా పుష్కరాలు చంద్రబాబు పాలనా సమర్థతకు నిదర్శనంగా నిలిచాయి. చిన్నచిన్న ఘటనలు జరిగినా.. అది ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రణాళికా లోపం కారణంగా జరిగిందన్న విమర్శల్ని ఎవరూ చేయకపోవటం ఆయన విజయంగా చెప్పాలి.
ఇదిలా ఉంటే.. ఊహించిన దాని కంటే భారీగా సక్సెస్ అయిన పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ ఎమ్మెల్సీలు వినూత్నంగా వ్యవహరించారు. తమ అధినేత పర్సనల్ గా తీసుకొని మరీ పని చేసిన పుష్కరాల సక్సెస్ ను పురస్కరించుకొని ఆయనకు అభినందనలు తెలుపుతూ పోస్టర్లు తయారు చేయించారు. కోట్లాది మంది భక్తులు పుష్కర స్నానాలకు వచ్చినా ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన వైనాన్ని కీర్తిస్తూ.. ‘‘థ్యాంక్యూ సీఎం సార్’’ అంటూ ఏర్పాటు చేసిన పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఎమ్మెల్సీలు రూపొందించిన ఈ పోస్టర్ తో చంద్రబాబుకు వినూత్నంగా అభినందనలు పలికిన తీరు మిగిలిన పార్టీ నేతల దృష్టిని ఆకర్షించింది. ప్రభుత్వంలో తమకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదన్న భావనలో ఉన్న ఏపీ అధికారపక్ష ఎమ్మెల్సీలు తాజాగా రూపొందించిన పోస్టర్ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిందన్న భావన వ్యక్తమవుతోంది.