నిండు లోక్‌సభ సాక్షిగా కేంద్ర సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఆంధ్రప్రదేశ్ సహా ఏరాష్ర్టానికి ప్రత్యేక హోదా ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అసలు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే విషయంలో సరైన ప్రతిపాదనలే లేవని... ఆర్థిక సంఘం సిఫారసుల తర్వాత 42% నిధులను రాష్ట్రాలకు ఇస్తామే తప్ప ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు.
ఒక రాష్ర్టం, దాదాపు 6 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలపై ఇంత డైరెక్టుగా తమ అభిప్రాయాన్ని నో అనేసి చెప్పినపుడు ఎవరైనా ఎలా స్పందిస్తారు. కచ్చితంగా తమ నిరసనను వెల్లడిస్తారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగింది అదే. ప్రతి దశలోనూ ఆ డిమాండ్‌తో సభ దద్దరిల్లేది. కానీ తాజాగా లోక్‌సభలో ఈ ప్రకటన చేసిన తర్వాత ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతూ బీహార్, ఒడిశా, రాజస్థాన్ ఎంపీలు ఆందోళన చేశారు. పోడియం చుట్టుముట్టారు... ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
మరి ఆంధ్రప్రదేశ్ ఎంపీల సంగతి ఏంటి? కేంద్రమంత్రి ప్రకటనపై ఏపీ ఎంపీలు ఒక్కరు కూడా తమ సీట్ల నుంచి కదల్లేదు. కనీసం తోటి ఎంపీలకు సంఘీభావం కూడా ప్రకటించలేదు. బీహార్, ఒడిశా, రాజస్థాన్ ఎంపీలు చేస్తున్న ఆందోళన గురించి చూస్తూ అలా సీట్లలోనే ఉండిపోయారు. మరి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గమనించాడో లేదో!