కనిపించకకున్నా నిన్న ఆంధ్రోళ్ల గుండె మండింది

Update: 2016-11-02 06:09 GMT
ఉన్నట్లుండి.. ఎవరైనా తెలుగువారిని నిన్నటి రోజు ప్రత్యేకత ఏమిటని ప్రశ్నించండి. ఒక్కసారి ఆశ్చర్యంగా చూస్తారు. ఏముంది స్పెషల్ అన్న మాట చాలామంది నోటి నుంచి వచ్చే పరిస్థితి. అయితే.. ఇదే ప్రశ్నను.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని అడిగితే బోరుమనే పరిస్థితి. రాజకీయాల్ని తిట్టిపోస్తూ.. ఒక ముఖ్యమైన రోజును.. ఎలాంటి ప్రాధాన్యత లేని దినంగా మార్చేసిన వైనంపై రగిపోవటం కనిపిస్తుంది. ఇంతకీ నిన్నటికి (నవంబరు 1) ఉన్న ప్రత్యేకత ఏమిటి? అన్నది ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందా?

కాలగర్భంలో కలిసి పోయిన రెండున్నరేళ్ల కాలంలో చోటు చేసుకున్న మార్పులతో నవంబరు1 అన్న వెంటనే ‘‘ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం’’ అన్న మాట చాలామంది తెలుగువారి స్మృతిపథం నుంచి తొలిగిపోయిన పరిస్థితి. ఆఫీసులకు సెలువలు ఇచ్చి.. మీడియాలో ప్రముఖంగా ప్రచారమై.. ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే గుర్తుకు వచ్చే రోజు.. విభజన నేపథ్యంలో ఎవరికి వారు ఆ రోజునుఅలా వదిలేయటంతో.. ఇప్పుడు నవంబరు ఒకటి సాదాసీదా రోజుల్లో ఒకటిగా మారిపోయింది.

ఉమ్మడిరాష్ట్రంలో ఆంధ్ర్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా అందరికి సుపరిచితమైన నవంబరు 1.. విభజన తర్వాత ఏపీ సర్కారు ఆ రోజుకు ఎలాంటి ప్రాధాన్యత లేదని తేల్చేయటంతో.. దాన్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. చాలామంది ఆంద్రోళ్ల గుండెల్లో నవంబరు 1 విభజన గాయాన్ని మళ్లీ రేపటమే కాదు.. విభజన కారణంగా తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రగిలిపోయిన వైనం.. పలువురు మాటల్లో కనిపించింది. అయితే.. ఇలాంటి వాటిని మీడియా కవర్ చేసే ధోరణి ఎప్పుడో మరిచిపోయిన వేళ.. తమ లాంటి వారి ఆవేదనను ఎవరూ పట్టించుకోవటం లేదన్న మాట వారి నోట వినిపించటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News