ఇది బాబు మార్కు బ‌డ్జెట్‌!

Update: 2019-02-05 08:26 GMT
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ ప్ర‌భుత్వం కీల‌క బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టింది. సబ్బండ వ‌ర్గాల సంక్షేమానికి అందులో పెద్ద‌పీట వేసింది. పేరుకు ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్టే అయినా ప్ర‌జ‌ల ప్ర‌యోజాల ప‌రిర‌క్ష‌ణ‌లో - కేటాయింపుల్లో ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ముఖ్యంగా రైతుల‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ‌రాల జ‌ల్లు కురిపించింది. వారి కోసం అన్న‌దాతా సుఖీభ‌వ పేరుతో ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని ప్రారంభించింది. దానికి రూ.5 వేల కోట్లు కేటాయించింది. నిరుద్యోగ భృతిని రూ.1000 నుంచి రూ.2 వేల‌కు పెంచుతూ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

2019-20 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆయ‌న బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం ఇది 11వసారి కావ‌డం గ‌మ‌నార్హం. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంద‌ని య‌న‌మ‌ల త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. దాని వల్ల రాజధాని నగరాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విభ‌జ‌న స‌మ‌యంలో ఆదాయ-వ్యయాలు - ఆస్తులు-అప్పుల పంపిణీ సరిగా జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు.

2019-20 బడ్జెట్‌ అంచనా మొత్తం రూ.2,26,117.53 కోట్లు. గతేడాది కంటే ఇది 18.38 శాతం ఎక్కువ‌. రెవెన్యూ వ్యయం రూ.1,80,369.33 కోట్లు. గ‌తేడాదితో పోలిస్తే ఇది 20.03 శాతం అధికం. మూలధన వ్యయాన్ని రూ.29,596.33 కోట్లుగా, రెవెన్యూ మిగులును రూ.2,099.47 కోట్లుగా తాజా బ‌డ్జెట్ లో అంచనా వేశారు. ఆర్థిక లోటు అంచ‌నాను రూ.32,390.68 కోట్లుగా పేర్కొన్నారు. అన్ని వ‌ర్గాలకు స‌మ ప్రాధాన్యం ద‌క్కేలా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ బ‌డ్జెట్ పై అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

తాజా బ‌డ్జెట్‌ లో ఏపీ ప్ర‌భుత్వం ఆరు కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. వాటికి నిధులు మంజూరు చేసింది.

నూత‌న ప‌థ‌కాలు      -        కేటాయించిన నిధులు

అన్నదాతా సుఖీభవ  -  రూ.5 వేల కోట్లు
క్షత్రియ కార్పొరేషన్   -   రూ.50 కోట్లు
హౌస్ సైట్స్ భూ సేకరణ -  రూ.500 కోట్లు
ఎమ్.ఎస్.ఎమ్.ఈకి ప్రోత్సాహం  -  రూ.400 కోట్లు
డ్రైవర్స్ సాధికార సంస్థ  -   రూ.150 కోట్లు
మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన  -  రూ.100 కోట్లు

బ‌డ్జెట్ లో ఆయా రంగాలకు  కేటాయింపులు

వ్యవసాయం  - రూ. 12, 732 కోట్లు
బీసీ వెల్ఫేర్ -  రూ.8,242 కోట్లు
అటవీ పర్యావరణం -  రూ. 491 కోట్లు
ఉన్నత విద్య - 3,171 కోట్లు
ఇంధన మరియు ఇన్‌ ఫ్రాస్ట్రక్షర్  -  రూ.5,473కోట్లు
సెకండరీ ఎడ్యుకేషన్ -  రూ. 22,783 కోట్లు
పౌరసరఫరాలు - రూ. 3,763 కోట్లు
ఆర్థికశాఖ - రూ. 51, 841 కోట్లు
సాధారణపరిపాలన శాఖ - రూ.1,117కోట్లు
వైద్యారోగ్యశాఖ - రూ.10,032 కోట్లు
హోంశాఖ - రూ.6,397 కోట్లు
గృహనిర్మాణశాఖ - రూ.4079 కోట్లు
జలవనరులశాఖ - రూ. 16,852 కోట్లు
పరిశ్రమలశాఖ - రూ.4,114 కోట్లు
ఐటీ - రూ.1006 కోట్లు
కార్మిక ఉపాధి కల్పన - రూ.1225 కోట్లు
న్యాయశాఖ - రూ.918 కోట్లు
అసెంబ్లీ -  రూ.149 కోట్లు
మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ - రూ.7979 కోట్లు
మైనార్టీ వెల్ఫేర్ - రూ.1308 కోట్లు
ప్లానింగ్ - రూ.1403 కోట్లు
పంచాయతీరాజ్‌ - రూరల్‌ డెవలప్‌ మెంట్  - రూ. 35,182 కోట్లు
రెవెన్యూశాఖ -  రూ. 5546 కోట్లు
రియల్‌ టైమ్‌ గవర్నెన్స్ -  రూ.172 కోట్లు
స్కిల్‌ డెవలప్‌ మెంట్ - రూ.458 కోట్లు
సోషల్‌ వెల్ఫేర్ - రూ. 6861 కోట్లు
రోడ్లు భవనాలశాఖ -  రూ.5382 కోట్లు
మహిళాశిశు సంక్షేమశాఖ -  రూ. 3408 కోట్లు
యువజన క్రీడలు - రూ. 1982 కోట్లు
చిన్నమధ్యతరహా పరిశ్రమలు -  రూ. 400 కోట్లు
డ్రైవర్‌ సాధికార సంస్థ - రూ.150 కోట్లు
క్షత్రియ కార్పొరేషన్ -  రూ. 50 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి -  రూ. 1000 కోట్లు
యాంత్రీకరణ -  రూ.300 కోట్లు
మత్స్యశాఖ అభివృద్ధి -  రూ.100 కోట్లు
ఎస్సీ సబ్‌ ప్లాన్  - రూ.14,367 కోట్లు
ఎస్టీ సబ్‌ ప్లాన్ - రూ.5,385 కోట్లు
బీసీ సబ్‌ ప్లాన్ -  రూ.16,226 కోట్లు
మైనార్టీ సబ్‌ ప్లాన్ -  రూ.1,304 కోట్లు
పసుపు- కుంకుమ -  రూ.4 వేల కోట్లు
బీసీల కార్పొరేషన్ -  రూ.3 వేల కోట్లు
ముఖ్యమంత్రి యువనేస్తం -  రూ.1200 కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు  -  రూ.1100 కోట్లు
చంద్రన్న బీమా -  రూ.354 కోట్లు
అన్నా క్యాంటీన‌న్లు - రూ.300 కోట్లు
చేనేత -  రూ.225 కోట్లు
9 - 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం -  రూ.156 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు -  రూ.175 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు -  రూ.128 కోట్లు
మైనార్టీలకు దుల్కన్‌ పథకం -  రూ.100 కోట్లు
ఎన్టీఆర్‌ విదేశీ విద్య -  రూ.100 కోట్లు
పెన్షన్‌ కింద వృద్ధాప్య - వింతంతువులకు -   రూ. 10,401 కోట్లు
Tags:    

Similar News