ఏపీ అధికార పార్టీ వైసీపీ విషయంలో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు? ప్రభుత్వంలోనివారిపై ప్రజలకు ఏమేరకు అవగాహన ఉంది? ప్రభుత్వంలో ఉన్నవారి పేర్లు. ఊర్లు.. వారి నియోజకవర్గాలు ఎంతమందికి తెలుసు? అనే విషయాలు పరిశీలిస్తే.. చిత్రమైన సమాచారం వస్తోంది. సాధారణంగా.. ప్రజలకు తమ నాయకులపై.. అవగాహన ఉంటుంది. ప్రభుత్వంలో ఎవరున్నారు? ఏం చేస్తున్నారు? అనేది కూడా వారికి తెలిసి ఉంటుందని అందరూ అనుకుంటారు. అయితే.. ప్రభుత్వం, మంత్రి వర్గంలోని నేతల పేర్లు, ఊర్లు.. వివరాలు తెలిసిన ప్రజలు చాలా తక్కువ మంది ఉన్నారనే విషయం విస్మయం కలిగిస్తోంది.
ఒక్క జగన్ తప్ప ప్రజలకు మంత్రివర్గంలోని వారి వివరాలు తెలియవంటే ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. దేశంలో ఎక్కడా లేని విధంగా తన మంత్రివర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించారు. వీరిలో ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనార్టీ.. కాపు సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారు. ఆదిలో ఇదేంటి? అని పెదవి విరిచిన వారు కూడా.. తర్వాత.. జగన్ వ్యూహం తెలుసుకుని భేష్ అన్నారు. ఎందుకంటే.. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. తనతో సమానంగా పదవులు ఇవ్వడం.. అందరినీ అచ్చరువొందే లా చేసింది.
అయితే.. ఇప్పటికి జగన్ పాలన ప్రారంభించి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఈ క్రమంలో `తుపాకీ` అసలు.. మంత్రి వర్గంపై ప్రజలకు ఏమాత్రం సమాచారం తెలుసు? అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. మరీ ముఖ్యంగా కేబినెట్‌లో కీలక స్థానమైన ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఎంత మంది ఉన్నారు? వారు ఏయే సామాజికవర్గాలకు చెందిన వారు? ఏయే నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు? అనే విషయాలను రాబట్టేందుకు ప్రయత్నించింది. మొత్తం వివిధ జిల్లాలకు చెందిన 150 మంది నుంచి సమాచారం రాబట్టింది.
వాస్తవానికి రాష్ట్రంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పుష్ప శ్రీవాణి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామి, మైనారిటీ వర్గానికి చెందిన అంజాద్ బాషా, కాపు వర్గానికి చెందిన ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్‌లు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే.. వీరిపై ప్రజలు ఉన్న అవగాహన చాలా తక్కువేనని తుపాకీ చేసిన సర్వేలో స్పష్టంగా తెలిసింది. రాష్ట్రంలో డిప్యూటీ సీఎంల పేర్లు చెప్పమని అన్ని జిల్లాల నుంచి 150 మందిని ర్యాండమ్‌గా ప్రశ్నించగా.. చాలా తక్కువ రెస్పాన్స్ రావడం గమనార్హం. ఒక్కొక్కరికీ 20 సెకన్ల సమయం ఇచ్చి.. డిప్యూటీ సీఎంల వివరాలు కోరగా.. 150 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే.. 25-30 సెకన్ల వ్యవధిలో ఐదురుగు డిప్యూటీ సీఎంల పేర్లను వెల్లడించారు.
మిగిలిన 145 మంది పేర్లు చెప్పలేక.. గుటకలు మింగారు. ఇక, వీరిలో ఎక్కువ మంది కేవలం ఇద్దరి పేర్లు చెప్పారు. 99 శాతం మంది నలుగురు పేర్లు చెప్పలేక పోయారు. ఇక, 150 మందిలో 99 శాతం మంది మాత్రం ఇద్దరి పేర్లు చెప్పారు. సో.. దీనిని బట్టి.. కేవలం జగన్‌పై మాత్రమే ప్రజలకు అవగాహన ఉందని భావించాల్సి వస్తోంది. అదేసమయంలో.. డిప్యూటీ సీఎంలు ప్రజల్లో ఉండడం లేదనే విషయాన్ని కూడా గుర్తించాల్సి వస్తోంది. కేవలం జగన్ హవాలోనే కొట్టుకు రావడం.. ఆయన ఇచ్చిన పదవిని అనుభవించడం తప్ప.. వీరు ప్రజల్లో ఉండని కారణంగానే వారి పేర్లు కూడా పెద్దగా తెలియని పరిస్థితి వచ్చిందనే విషయం సర్వేలో స్పష్టంగా తెలిసింది .
మరి జగన్‌నే నమ్ముకుని గెలిచి వీరికి అన్ని సార్లూ విజయం సాధ్యమేనా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ఒకసారి కాబట్టి.. జగన్ హవాలో కొట్టుకువచ్చారు. మరి వచ్చే ఎన్నికల్లోనూ.. అదే హవాతో వస్తామంటే.. కుదరదు కదా..? వారికంటూ.. ప్రత్యేకతను సంతరించుకుంటేనే కదా.. ప్రజలు మళ్లీ గెలిపిస్తారు. కానీ, ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు వీరు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. కనీసం ఇప్పటికైనా..డిప్యూటీ సీఎంలు ఇటు పార్టీలోను.. అటు ప్రజల్లోనూ పట్టు సాధించాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
దీనికి సంబంధించి మీదగ్గర మరింత సమాచారం ఉంటే.. మాతో పంచుకోవడం మరవొద్దు!!