ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం.. ఆ దిశగా ముందుకు సాగిపోతోంది. విడతలవారిగా ఒక్కో నిర్ణయాన్ని అమలు చేస్తుంది. మద్యపానం నిషేధానికి సంబంధించి ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇకపై ఏపీలో మద్యం కొనాలి అంటే లిక్కర్ కార్డ్ తప్పనిసరి. అదేంటి ..ఇప్పటి వరకు రేషన్ కార్డ్, ఎటిఎం కార్డ్ తెలుసు కానీ , ఈ లిక్కర్ కార్డ్ ఏంటి అని అనుకుంటున్నారా.. అవును నిజమే అతి త్వర లో ఏపీ ప్రభుత్వం లిక్కర్ కార్డ్ ని ప్రవేశ పెట్టబోతున్నట్టు సమాచారం.
ఇందులో భాగంగా ఇక పై ఏపీలో ఎవరైనా మద్యాన్ని కొనుగోలు చేయాలంటే లిక్కర్ కార్డు తీసుకోని , 5 వేలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ కి రీచార్జ్ చేసినట్లు ఈ కార్డుని రీచార్జ్ చేయాలి. లిక్కర్ కార్డులోని అమౌంట్ అయి పోయాక మళ్లీ రూ.5వేలు చెల్లించి కార్డు రెన్యూవల్ చేసుకోవాలి. అంతేకాదు, 25 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ కార్డును పొందటానికి అర్హులు. 25 ఏళ్లు నిండినట్టుగా మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అలా సర్టిఫికెట్ ఉన్న వాళ్లకే ఈ కార్డులు ఇస్తారు. గుర్తింపు పొందిన ఆసుపత్రి డాక్టర్ నుండి ఏ జబ్బు లేదని మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది.
మద్యం పై ఒక్కసారే నిషేధం విధిస్తే వ్యతిరేకత వస్తుందనే భావన తో.. దశల వారీగా నిషేధాన్ని విధించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగం గానే మద్యం షాపుల ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అలానే మద్యం ధరలను భారీగా పెంచింది. ఇందులో భాగంగానే లిక్కర్ కార్డ్ ని ప్రవేశ పెట్టబోతుంది. దీని ద్వారా ముందుగా నిధులు సేకరించడంతో పాటుగా, అమ్మకాలను కూడా నియంత్రించినట్టుగా ఉంటుందని ప్రభుత్వం ప్లాన్.