ఏపీకి ఒక కేసీఆర్ ఉండి ఉంటే..సీన్ ఇలా అయితే ఉండేది కాదు

Update: 2021-03-10 16:30 GMT
కోట్లాది మంది ఆంధ్రులు.. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్నోళ్లను కలిపితే.. వారి బలం మామూలుగా ఉండదు. ఎవరి దాకానో ఎందుకు.. సత్య నాదెళ్లను తీసుకోండి. వ్యక్తిగతంగా చూస్తే ఆయన ఎంత బలవంతుడన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ.. ఆ స్థాయిలో కాకున్నా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రోళ్లు తమ సొంత నేలకు జరుగుతున్న అన్యాయం మీద ఫోకస్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. విభజనతో జరిగిన నష్టం ఒక పక్కన.. మరోవైపు ఒకటి తర్వాత ఒకటిగా ఎదురవుతున్న నష్టాలకు.. చోటు చేసుకుంటున్న ద్రోహాలకు పెదవి విప్పే వారెవరూ లేరా? అన్నది ప్రశ్న.

రెండు..మూడు రోజుల క్రితం సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఏపీ హక్కుల కోసం.. ఏపీకి రావాల్సిన వాటి గురించి మాట్లాడటానికి ఏ ఒక్కరికి ఎందుకు ధైర్యం సరిపోవటం లేదో అర్థం కావట్లేదన్నారు. నిజమే.. అధికార విపక్షానికి చెందిన నేతలు ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు? దాని వెనకున్న కారణమేంటి? అన్నది ఇప్పుడు ప్రశ్న. మరోవైపు..విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మేస్తానని తేల్చి చెబుతోంది కేంద్రంలోని మోడీ సర్కారు. తాము ఏమనుకుంటామో దాన్ని నెరవేర్చేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గని వారి తీరుతో పోరు చేయాలంటే అందుకు మామూలోళ్లు అస్సలు సరిపోరు.

అందుకే.. ఆంధ్రాకి కేసీఆర్ లాంటి ఉద్యమ నేత అవసరం ఎంతైనా ఉంది. ఎవరికి వారు.. వారి వ్యక్తిగత ప్రయోజనాలే తప్పించి.. తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించేవాడు.. మాట్లాడేటోడు కనిపించని పరిస్థితి. ఇప్పటికే విభజన.. ప్రత్యేక హోదా.. పోలవరం.. తాజాగా విశాఖ ఉక్కు.. ఇలా చూస్తుండి పోతే.. రానున్న రోజుల్లో మరెన్ని క్షవరాలకు ఆంధ్రోళ్లను సిద్ధం చేస్తారో అర్థం కాని పరిస్థితి. అందుకే.. అర్జెంట్ గా ఆంధ్రాకి కేసీఆర్ లాంటోడి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికప్పుడు అలాంటోడు ఆంధ్రాలో తయారు కావాలంటే కష్టం. అందుకే.. కాస్త ఖర్చు ఎక్కువైనా ఫర్లేదు.. అద్దెకు తెచ్చినా బాగానే ఉంటుంది. ఈ విషయం మీద కాస్త సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమంటారు?


Tags:    

Similar News