దేశంలోనే కరోనా కేసుల సంఖ్య బాగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అయితే కేంద్రం మూడో సారి విధించిన లాక్ డౌన్ లో పలు మినహాయింపులను ఇచ్చింది. దీనిని సీఎం జగన్ పర్యవసనాలు పట్టించుకోకుండానే అమలు చేసేశారు. సోమవారం నుంచి గ్రీన్,ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలు మొదలుపెట్టారు. దీంతో జనాలంతా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల ఎదుట క్యూ కట్టి మందు కోసం ఎగబడ్డారు. ఈ వీడియోలన్నీ జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. ఏపీ పరువు తీశాయి.
40రోజుల భారీ లాక్ డౌన్ తర్వాత మద్యం కోసం అర్రులు చాస్తున్న మందు బాబులంతా వైన్స్ షాపులు తెరుచుకోకముందే క్యూలు కట్టడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ధరలు పెంచడంతో గందరగోళం మద్య మద్యం అమ్మకాలు మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. సాయంత్రం 7 గంటల వరకు తెరిచే ఉంచారు.
ఏపీ వ్యాప్తంగా మొత్తం 3468 మద్యం దుకాణాలు ఉండగా.. లాక్ డౌన్ తర్వాత తొలిరోజు 2345 దుకాణాలను తెరిచినట్టు అధికారులు తెలిపారు. ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదు.
మద్యం షాపులు తెచుకున్న తొలిరోజు ఆంధ్రప్రదేశ్ లో రికార్డ్ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. దాదాపు రూ.60కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు సమాచారం. సాధారణంగా రోజూ రూ.60-70 కోట్ల వరకు మద్యం అమ్మకాలు సాగుతాయి. అయితే మూడో వంతు దుకాణాలు రెడ్ జోన్లలో ఉండడం వల్ల అక్కడ షాపులు తెరుచుకోలేదు. కానీ సర్కార్ మాత్రం ధరలు పెంచడంతో భారీగా ఆదాయం సమకూరింది.
ఇక సరిహద్దున గల చిత్తూరు జిల్లాలోకి తమిళనాడు నుంచి జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. అక్కడ మద్యం షాపులు తెరవక పోవడంతో ఏపీకి వచ్చి ఎగబడ్డారు. ఏపీలో మద్యం కోసం ఎగబడ్డ జనాల వీడియోలు దేశమంతా వైరల్ అవుతున్నాయి. ఏమాత్రం సోషల్ డిస్టేన్స్ పాటించకుండా తోసుకొని మద్యం కోసం ఎగబడ్డతీరు మీడియాలో ప్రధాన శీర్షికన ప్రచురితమైంది. ఇలా అయితే కరోనా వ్యాపించదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో పరిస్తితిపై కేంద్రం ఆరాతీసిందని.. లాక్డౌన్ సడలింపులను ఇలా చేస్తే ఎత్తివేసే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.