అక్టోబర్ 15వ తేదీ నుంచి వైసీపీలోని మంత్రులు, ఎంఎల్ఏల జాతకాలు తేలిపోతాయా ? జగన్మోహన్ రెడ్డి ప్రకటన అనుకోండి లేదా వార్నింగ్ అనుకోండి అర్ధం మాత్రం అలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే అక్టోబర్ 15వ తేదీ నుండి ప్రతి ఎంఎల్ఏకి తోడుగా ఐప్యాక్ ప్రతినిధిని అటాచ్ చేయబోతున్నట్లు చెప్పారు.
అంటే ఎంఎల్ఏల పనితీరును ఐప్యాక్ ప్రతినిధులు క్లోజ్ ఉండి వాచ్ చేయబోతున్నారని అర్ధమవుతోంది.
ఈ ప్రతినిధులు ఎంఎల్ఏలతో ఉండి ఏమి చేస్తారు ? ఏమిచేస్తారంటే రోజువారి నివేదికలు అందిస్తారు. ఎంఎల్ఏ పనితీరు ఎలాగుంది ? ప్రజల దగ్గరకు వెళుతున్నారా ? వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ? గ్రామ, వార్డు సచివాలయాలను ఎంఎల్ఏలు సందర్శిస్తున్నారా లేదా అనే ప్రతి విషయాన్ని ఐప్యాక్ ప్రతినిధి గమనిస్తుంటారు. ఎంఎల్ఏ రోజువారీ కార్యక్రమాల ఆధారంగా ఈ ప్రతినిధి ఒక నివేదికను తయారు చేసి తమ ప్రధాన కార్యాలయంకు పంపుతారు.
ప్రతినిధుల నుండి రోజు అందుతున్న నివేదికలను ఐప్యాక్ ఆఫీసులోని విశ్లేషకులు ఎనాలసిస్ చేస్తారు. దీని ఆధారంగా ఎంఎల్ఏల పనితీరుపై రిపోర్టు తయారుచేసి వారానికి ఒకసారి జగన్ కు నివేదిక అందిస్తారు. ఇలా 175 నియోజకవర్గాల నుంచి నివేదికలు అందుతాయి. దీని ఆధారంగా ఎవరు ఎలాగ పనిచేస్తున్నారు ? ఎవరు వెనకబడున్నారు ? ఎవరు బాగా పనిచేస్తున్నారు ? అనే విషయాలను జగన్ ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటారు.
ఇప్పటివరకు పార్టీ వర్గాలు లేదా ఇంటెలిజెన్స్ వర్గాల నుండే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. అయితే అక్టోబర్ 15వ తేదీనుండి ఐప్యాక్ ప్రతినిధిని అటాచ్ చేయబోతున్నట్లు డైరెక్టుగానే జగన్ ప్రకటించారంటేనే తానెంత సీరియస్ గా ఉన్నారో అర్ధమవుతోంది.
పనితీరు ఆధారంగా మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు జగన్ ప్రకటించారు. జగన్ వార్నింగులను గుర్తుపెట్టుకుని పనితీరు మెరుగు పరుచుకుంటున్న వాళ్ళున్నారు. ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నవారూ ఉన్నారు. గడపగడపకు వైసీపీ సమీక్షలో మంత్రులు, ఎంఎల్ఏలు కలిపి 27 మంది పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మరి అక్టోబర్ 15 నుండి వీళ్ళ పనితీరు ఎలాగుంటుందో చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.