సీఎం జ‌గ‌న్ పెన్ను క‌థ ఏంటో తెలుసా?

Update: 2022-07-27 04:18 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కోన‌సీమ జిల్లాలో వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌ర్గంలోని గ‌న్న‌వ‌రం మండ‌లంలో పలు గ్రామాల‌ను ఆయ‌న సంద‌ర్శించారు. వ‌ర‌ద‌కు దెబ్బ‌తిన్న పంట పొలాల‌ను, ఇళ్ల‌ను జ‌గ‌న్ ప‌రిశీలించారు. వారికి అభ‌య‌మిచ్చారు. ప్ర‌భుత్వం అన్ని విధాలా సాయం చేస్తుంద‌ని హామీ ఇచ్చారు.

కాగా, గ‌న్న‌వ‌రం మండ‌లం జి.పెద‌పూడి లంక‌లో సీఎం బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తున్న‌ప్పుడు న‌క్కా విజ‌య‌ల‌క్ష్మి అనే ఆమెతో మాట్లాడారు. ఆమె చంక‌లో ఉన్న 8 నెల‌ల చిన్నారి న‌క్కా విజ‌య‌చైత‌న్య‌ని తీసుకుని జ‌గ‌న్ ఆప్యాయంగా ముద్దాడారు.

ఆ చిన్నారిని కాసేపు ఎత్తుకునే బాధితుల‌తో, అధికారుల‌తో మాట్లాడారు.. జ‌గ‌న్. ఈ నేప‌థ్యంలో సీఎం చేతుల్లో ఉన్న చిన్నారి బాలుడు ఆయ‌న జేబులో ఉన్న పెన్నును తీసుకున్నాడు. పెన్ను కావాలా అని అడిగారు. అక్క‌డ ఉన్న‌వారు బాలుడి నుంచి పెన్ను తీసుకుని సీఎంకు ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే ఆ బాలుడు పెన్నును ఇవ్వ‌కుండా త‌న నోటిలో పెట్టుకున్నాడు.

దీంతో సీఎం ఆ పెన్నును ఆ చిన్నారికి ఇచ్చివేశారు. అయితే ఆ పెన్ను మౌంట్ బ్లాంక్ పెన్ను అని చెబుతున్నారు. దీని ఖ‌రీదు రూ.30 వేల వ‌ర‌కు ఉంద‌ని అంటున్నారు. సీఎం త‌న పెన్నును చిన్నారికి ఇచ్చివేయ‌డంతో వెంట‌నే తాడేప‌ల్లిలో ఉన్న సీఎంవో అధికారులు కొత్త పెన్నును తెప్పించ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా ప్ర‌స్తుతం స్టాక్ లేద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ మౌంట్ బ్లాంక్ పెన్నులు అంటే సీఎం జ‌గ‌న్ కు చాలా ఇష్ట‌మ‌ని అంటున్నారు.

కాగా గ‌తంలోనూ సీఎం తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ ఒక బాలిక‌తో మాట్లాడుతూ నీకు ఏం కావాలి త‌ల్లి అని అడుగ‌గా.. ఆ బాలిక మీ పెన్ను కావాల‌ని అడ‌గ‌డంతో సీఎం ఆ పెన్నును బాలిక‌కు ఇచ్చివేశారు. దీంతో సీఎం తిరుప‌తి నుంచి తాడేప‌ల్లి వ‌చ్చేస‌రికి ఆ పెన్నును సీఎంవో అధికారులు సీఎం ఇంటికి చేర్చారు. మ‌రోమారు సీఎం ఆ పెన్నును కోన‌సీమ చిన్నారికి ఇచ్చివేయ‌డంతో మ‌రో పెన్ను కోసం ప్ర‌య‌త్నించ‌గా ఆ పెన్ను స్టాక్ లేద‌ని స‌మాచారం. దీంతో అధికారులు ఏం చేస్తారో వేచిచూడాల్సిందే.

ముఖ్యంగా సీఎం స‌ల‌హాదారు ఒక‌రు త‌ర‌చూ సీఎంకు ఈ పెన్నుల‌ను బ‌హూకరిస్తుంటార‌ని.. ఇలా పెన్నులు ఇచ్చే సీఎంకు, ఆయ‌న స‌తీమ‌ణికి బాగా ద‌గ్గ‌ర‌య్యార‌ని గాసిప్ ఉంది.
Tags:    

Similar News