అయ్య‌బాబోయ్‌.. ఘాటెక్కిపోతోంది.. వైసీపీ ఎమ్మెల్యేల వేడుకోలు!!

Update: 2022-12-26 00:30 GMT
ఔను.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల గోడు ఇదే! ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చేసింద‌ని వారు తెగేసి చెప్పేస్తున్నారు. వెళ్ల‌లేమ‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి.? అంటే.. తాజాగా స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యమే. ఇటీవ‌ల‌ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. సామాజిక పింఛ‌న్ల‌ను రూ.250 మేర‌కు పెంచారు. దీనిని వైసీపీ నాయ‌కులు త‌మ‌కు క‌ల‌సి వ‌స్తుంద‌ని అనుకున్నారు.

ఉత్సాహంగా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ఇంత‌లోనే పిడుగులాంటి వార్త వారిని హ‌తాశుల‌ను చేసింది. అదేంటే.. పింఛ‌న్ల‌ను ర‌ద్దు చేయ‌డం. రాష్ట్ర‌వ్యాప్తంగా ల‌క్ష‌ల సంఖ్య‌లో పింఛ‌న్ల‌ను ర‌ద్దు చేస్తూ.. ప్ర‌భుత్వం వివరాల‌తో స‌హా.. స‌చివాల‌యాల‌కు పంపించింది. దీంతో ర‌ద్దు ప్ర‌క్రియ జోరుగా సాగుతోంది. వ‌చ్చే నెల‌లోమీకు పింఛ‌ను రాదు.. ఇదీ కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల చుట్టూ.. జ‌నాలు తిరుగుతున్నారు. ఇదేంటి? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఆరోజు.. ఎన్నిక‌ల‌కుముందు ముద్దులు పెట్టి మ‌రీ.. ఓట్లు వేయించుకున్నారు క‌దా.. ఇప్పుడు ఇలా పింఛ‌న్లు తెగ్గోయ‌డం  ఏంట‌ని నిల‌దీస్తున్నారు.

దీంతో ఎమ్మెల్యేల‌కు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఎందుకంటే.. ఇంటికి ఒక పింఛ‌ను క‌ట్ చేసినా దాదాపు 3-4 ఓట్ల‌పై ప్ర‌భావం చూపుతుంది.

ప్ర‌తి కుటుంబంలోనూ నాలుగు ఓట్లు ఉన్నాయి. దీంతో ఈ పింఛ‌న్ల కోత‌.. ల‌బ్ధి దారుల కంటే కూడా వైసీపీ ఎమ్మెల్యేల‌కు ప్రాణ‌సంక‌టంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు అధిష్టానానికి ఫోన్ల‌పై ఫోన్లు చేస్తూ.. అయ్య బాబోయ్ ఈ నిర్ణ‌యం ఏంటి.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఘాటెక్కిపోతోంది.

ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లే ప‌రిస్థితి లేకుండా చేస్తున్నారు. ఈ ర‌ద్దును ర‌ద్దు చేయండి! అని విన్న‌వించుకుంటున్నార‌ట‌. కానీ, అధిష్టానం మాత్రం విన‌డం లేదు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News