దేశీయంగా పవర్ ఫుల్ పారిశ్రామికవేత్తగా పేరున్న అనిల్ అంబానీ.. గడిచిన కొద్దికాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పాటు.. వరుస ఎదురుదెబ్బలు తింటున్నారు.
తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయన.. తమ గ్రూపునకు సంబంధించిన రెండు కంపెనీల్లో తాను నిర్వహిస్తున్న డైరెక్టర్ పదవులకు రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రిలయన్స్ పవర్.. రిలయన్స్ ఇన్ ఫ్ట్రాస్ట్రక్చర్ కంపెనీలకు అనిల్ అంబానీ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు పదవులకు రాజీనామా చేశారు.
ఇలాంటి పరిస్థితి ఎందుకన్న విషయంలోకి వెళితే.. ఈ రెండు సంస్థల్లో మోసపూరిత కార్యకలాపాలు చేపట్టినట్లుగా ఆరోపణలు రావటంతో సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా ఉండేలా అనిల్ అంబానీతో సహా మరో ముగ్గురిని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ అయిన సెబీ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
అంతేకాదు.. స్టాక్ మార్కెట్లో లిస్టు అయిన కంపెనీల నుంచి ఎలాంటి నిధులు సేకరించకూడదన్న మధ్యంతర ఆదేశాల్ని జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అనిల్ అంబానీ తన పదవులకు రాజీనామా చేశారు.
ఇదిలా ఉండగా అనిల్ రాజీనామా చేసిన రిలయన్స్ పవర్.. రిలయన్స్ ఇన్ ఫ్ట్రాస్ట్రక్చర్ కంపెనీలకు అదనపు డైరెక్టర్లను ఎంపిక చేశారు. వీరు ఈ పదవుల్లో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.