వైసీపీ అధినేత, సీఎం జగన్ ను ఎంత విమర్శించాలో అంతా విమర్శిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే జగన్ అంటే ప్రాణమిచ్చే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం పవన్ వైఖరిని జీర్ణించుకోవడం లేదు. ఇటీవల కాలంలో పవన్ ను సైతం తిట్టిపోస్తున్నారు మంత్రి అనిల్.
సమయం దొరికితే చాలు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ‘తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానని.. చదువుకునే రోజుల్లో మెగాస్టార్, పవర్ స్టార్ కు పెద్ద అభిమానిని.. పవన్ ను పిచ్చిగా అభిమానించేవాడిని’ అని మంత్రి అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానెల్ తో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇప్పటికీ అభిమానం ఉన్నా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిట్టాల్సి వస్తోందని అన్నారు. పవన్ నిజమైన రాజకీయ నేత కాదని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. సినిమాల్లో చిరంజీవి వల్ల ఎదిగానని.. రాజకీయాల్లోకి వచ్చాక కానిస్టేబుల్ కొడుకును అంటున్న పవన్ ద్వంద్వ వైఖరి ఇక్కడే తెలుస్తోందని అనిల్ కుమార్ ధ్వజమెత్తారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును పల్లెత్తు మాట అనని పవన్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ ను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చినా జగన్ ను టార్గెట్ చేసిన తీరు తనకు నచ్చలేదని అన్నారు. జగన్ పై తమకు నమ్మకం ఉందని.. పవన్ ను ధీటుగా ఎదుర్కొంటామని మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.