కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు అనుమానాస్పద మృతి కేసులో ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. రాజయ్య కుమారుడు అనిల్ రెండో భార్య సనను పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసులో ఏ4 నిందితురాలిగా సనాను పేర్కొన్నారు. సారిక సహా ముగ్గురు చిన్నారుల మరణం వెలుగులోకి వచ్చినప్పటినుంచి సనా పరారీలో ఉన్నారు. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించినట్లు సమాచారం. అయితే ఈ కేసులో సనాను కీలకమైన నిందితురాలిగా పేర్కొన్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. తాజాగా ఆమెను పోలీసులు ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు. సనకు ఇద్దరు పిల్లలున్నట్లు కూడా సమాచారం.
సారికను దూరంగా పెట్టి సనతో అనిల్ సంసారం చేయడం వల్లే ఆ కుటుంబంలో సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.... రాజయ్య సహా ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ వరంగల్ సెంట్రల్ జైలులో ఉంటున్నారు. సారిక మరణంపై అనుమానాలు తలెత్తినప్పటికీ ఆమెది ఆత్మహత్యేనని పోలీసులు రిమాండ్ నివేదికలో పొందుపరిచారు.