క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ గురించి ఆయన సతీమణి అంజలి టెండూల్కర్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వారి దాంపత్య బంధానికి 26 వసంతాలు పూర్తైన సందర్భంగా కొన్ని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. క్రికెట్ మైదానంలో ప్రత్యర్థుల పట్ల సింహస్వప్నంగా నిలిచే సచిన్... బయట మాత్రం చాలా సిగ్గరి అని చెప్పుకొచ్చారు.
సచిన్ చాలా సున్నితమనస్తత్వం గలవారని తెలిపారు. అంతేకాదు ఎవరితోనూ కావాలని మాట కలపడని అన్నారు. అవసరం ఉన్నంతవరకే మాట్లాడాతారని చెప్పారు. సచిన్ ను తాను తొలిసారిగా ఎయిర్ పోర్టులో కలిసినట్లు వెల్లడించారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తమ స్నేహం బలపడిందని చెప్పుకొచ్చారు. అలా అప్పటి రోజులను అంజలి నెమరువేసుకున్నారు.
సచిన్ తల్లిదండ్రులకు తనను ఓ జర్నలిస్టులా పరిచయం చేశారని చెప్పారు. అంతేకాదు అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ చేసేందుకు చాలా కష్టపడ్డారు పాపం అంటూ నవ్వుతూ ఆ సన్నివేశాన్ని వివరించారు. ఆ కాలంలో ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు అంతగా అందుబాటులో లేవని చెప్పారు.
ఫోన్లు అందుబాటులో ఉన్నా అది చాలా పెద్ద వ్యవహారం అని తెలిపారు. ఫోన్లు మాట్లాడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అన్నారు. తాము ఉత్తరాల ద్వారా సంభాషించుకునేవాళ్లమని వివరించారు. సచిన్, అంజలి విహాహం 1995లో జరిగింది. వారికి తనయుడు అర్జున్, తనయ సారా ఉన్నారు.