అంతా లోకేషే చేశారు.. టీడీపీ ఓటమికి ఆయన కారణం.. టీడీపీలో తెరవెనుక ఉండి చేసిన పనే టీడీపీ ఓటమికి కారణమైంది... ఇదీ టీడీపీలోని అసంతృప్తులు ఇన్ సైడ్ గా చెప్తున్న మాటలు.. మొన్న టీడీపీని వీడి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ ఎంపీలు - కాకినాడలో సమావేశమైన కాపు నేతలు కూడా లోకేష్ బాబు ఆధిపత్యం వల్లే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని అన్నారని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ సైతం లోకేష్ కారణంగానే పార్టీ ఓడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అన్న సతీష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి లోకేష్ వ్యవహారమే కారణమని ఆరోపించారు. కనీసం ఎన్నికల్లో గెలవలేని లోకేష్ దొడ్డిదారిన మంత్రి అయ్యి పార్టీని మొత్తం కంట్రోల్ చేశాడని మండిపడ్డారు.
కనీస అర్హత లేని లోకేష్ కు పార్టీ పగ్గాలు చంద్రబాబు అప్పగించాలని చూస్తున్నారని.. ఆయన సారథ్యంలో పనిచేయడానికి పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరని ఎమ్మెల్యే సతీష్ కుండబద్దలు కొట్టారు. ఆయన కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేరని స్పష్టం చేశారు. లోకేష్ కు దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. పార్టీలోకి లోకేష్ వచ్చాక టీడీపీ గ్రూపులతో హెరిటేజ్ సంస్థలా తయారైందని విమర్శించారు.
సతీష్ టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.ఈయన తోపాటు చాలా మంది నేతలు టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు డిసైడ్ అయ్యారని సమాచారం. అందుకే లోకేష్ ను తిట్టి బయటకు వెళ్లబోతున్నట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది.