కొన్ని వివాదాల్ని తెగే వరకూ లాగకూడదు. ఆ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రతికూల పరిస్థితులు నెలకొన్న వేళ.. సొంత పార్టీ నేతలతోనూ సయోధ్య నెరపలేని ఆయన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. నిన్నటి వరకూ ఆయన అమ్ములపొదిలో అస్త్రంలా ఉన్న మాజీ మంత్రి కపిల్ మిశ్రా.. ఇప్పుడాయనకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సత్యాగ్రహ్ దీక్ష కేజ్రీ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారింది.
ఇది సరిపోదన్నట్లుగా తాజాగా కపిల్ మిశ్రా తల్లి అన్నపూర్ణా మిశ్రా రాసిన ఒక లేఖ ఇప్పుడు కొత్త సంచలనంగా మారింది. కేజ్రీవాల్ కు తన తల్లి ఏదో చెప్పాలనుకుంటుందన్న ట్వీట్ చేసిన కాసేపటికే.. ఆయన తల్లి అన్నపూర్ణ మిశ్రా పేరిట వెలువడిన ఘాటు లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేజ్రీవాల్ తీరుపై నిప్పులు చెరిగిన ఆమె.. ఆయన తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
"ఎన్ని అసత్యాలు అరవింద్?.. ఎన్ని అసత్యాలు? అసత్యాలు నీకేమాత్రం మంచిది కాదు. భగవంతుడికి భయపడు.. నా కుమారుడు మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుందని.. మీరు ఆ ప్రశ్నలకు ముఖం చాటేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. అలాంటి పరిస్థితులు ఎదురవుతుందని ఊహించలేదు కూడా. నేను ఎప్పుడు కలిసినా ప్రజా జీవితంలో నిజాయితీ గురించి మీరు మాట్లాడేవారు. ఒక రోజు మీరు మా ఇంటికి వచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. కపిల్‌ను పార్టీలోకి తీసుకొని పోటీకి దింపాలని అనుకుంటున్నానని.. అతడు వినటం లేదని.. మీరు నాతో చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకోండి" అంటూ గతాన్ని గుర్తు చేయటంతో పాటు.. తన కుమారుడి నిజాయితీ ఎంతన్నది చెప్పే ప్రయత్నం చేశారు.
కపిల్ ఉద్యమంలో మాత్రమే పాల్గొనటాని అనుకునేవాడని.. అయితే అతన్ని మీరే కావాలన్నారని.. కపిల్ తో పని చేయాలని అనుకుంటున్న విషయాన్ని మీరు ఆ రోజు చెప్పారంటూ అన్నపూర్ణ వెల్లడించారు. ఇప్పుడు మాత్రం తన కొడుకును అర్థం చేసుకోవటం లేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. తన కొడుకు ఎవరి ఏజెంటు కాదని.. ఈ మాట నిజమని చెప్పిన ఆమె.. తన బిడ్డ మూడు రోజులుగా ఏమీ తినలేదని వాపోయారు. ఒక తల్లిగా తాను కోరేది ఒక్కటేనని.. అతను అడిగిందేదో ఇచ్చేయాలని చెప్పారు. కపిల్ మిశ్రా కోసం కేజ్రీవాల్ ఎంతగా ప్రయత్నించారన్న విషయాన్ని వెల్లడించే ప్రయత్నం చేసిన అన్నపూర్ణ మిశ్రా లేఖ ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/