చంద్రబాబు, టీడీపీ కి జగన్ మరో భారీ షాక్?

Update: 2020-01-02 06:15 GMT
తెలంగాణ లో కేసీఆర్ మొదటిసారి గద్దెనెక్కగానే సంక్షేమ పథకాల అమలు కోసం చేసిన ‘సకల జనుల సర్వే’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఆ సర్వే తర్వాత కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఇక పోయిన సంవత్సరమే కేసీఆర్ తెలంగాణలోని భూముల లెక్కలు తేల్చి రైతులకు కొత్త పట్టదారు పుస్తకాలు అందజేశారు.

ఇప్పుడు అదే బాటలో గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడెప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హాయాం లో ఏపీ లో 120 ఏళ్ల క్రితం తయారు చేసిన భూరికార్డుల ప్రక్షాళనకు నడుం బిగించారు. సమగ్ర భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు. తాజా గా కృష్ణ జిల్లా జగ్గయ్యపేట మండలంలో భూముల రీసర్వే నోటిఫికేషన్ ను జగన్ సర్కారు విడుదల చేసింది. దీన్ని బట్టి దశలవారీగా జగన్ సర్కారు రాష్ట్రమంతటా భూ సర్వేను చేయడానికి రెడీ అయినట్టే కనిపిస్తోంది.

సీఎం జగన్ ఎన్నికల హామీలోనూ భూ సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు సమగ్ర భూసర్వేకు పూనుకున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించారు.

చంద్రబాబు హయాంలో అమరావతి సహా చాలా భూములను కొల్లగొట్టారన్న ఆరోపణలు వచ్చాయి. విశాఖ భూకుంభకోణం, చుక్కల భూముల వ్యవహారం, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ సహా చాలా భూవివాదాలు వచ్చాయి. టీడీపీ గుట్టురట్టు చేయడానికే జగన్ ఈ భూ సమగ్ర సర్వే చేపట్టినట్టు తెలుస్తోంది.

భూ సమగ్ర సర్వేతో రికార్డులు ప్రక్షాళన చేసి భూ యజమానులకు భరోసా కల్పించడంతోపాటు టీడీపీ నేతల బినామీల గుట్టు రట్టు చేసేలా భూముల సర్వేకు జగన్ శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. 2022 మార్చికి పూర్తి చేయాలని 2వేల కోట్ల బడ్జెట్ కూడా కేటాయించిందట.
Tags:    

Similar News