అంబానీ చేతికి మరో బ్రిటీష్ సంస్థ

Update: 2021-04-23 06:30 GMT
దేశంలోనే అపర కుబేరుడు.. నంబర్ 1 ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ తన ఆస్తులను పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా ఆయన ఖాతాలోకి మరో వ్యాపార సంస్థ చేరింది.

కరోనా కల్లోలంతో అందరి వ్యాపారాలు దెబ్బతింటుంటే ఈయన మాత్రం ఆ వ్యాపారాలను కొనుగోలు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా అంబానీ మరో బ్రిటీష్ సంస్థను తన సొంతం చేసుకున్నారు.

గోల్ఫ్ కోర్స్, స్పా వంటి సదుపాయాలను కల్పించే బ్రిటన్ లోని లగ్జరీ హోటల్ స్టోక్ పార్క్ ను అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కొనుక్కుంది.

ఈ లావాదేవీ విలువ ఏకంగా 79 మిలియన్ డాలర్లు అని బ్రిటీష్ మీడియా తెలిపింది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ.. ఇప్పటికే బ్రిటీష్ టాయ్ స్టోర్ హ్యామ్ లెస్ కొనుగోలు చేశారు.
Tags:    

Similar News