ఏపీలో గత కొన్ని నెలలుగా వరుసగా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎదో ఒక చోట ఎలక్షన్ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో తిరుపతి పార్లమెంటు స్థానానికి, తెలంగాణలో నాగార్జునా సాగర్ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు స్థానిక సంస్థలకు పెండింగ్ ఉన్న ఎన్నికలు కూడా ఈ వేసవి లో జరగనున్నాయి. ఈ ఎన్నికల పరంపరలోనే ఏపీలో మరో అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది.
ఈ ఉప ఎన్నిక హీట్ అప్పుడే ప్రారంభమైంది. సీఎం జగన్ సొంత జిల్లా అయినా కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. కరోనాతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి చెందారు.దీనితో మరో అయిదు నెలలలో అక్కడ ఉపఎన్నిక అనేది జరిగితీరాల్సిందే. ఇక ఓ రకంగా వైసీపీ కి బద్వేల్ నియోజకవర్గం అనేది కంచుకోట. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కనీసం 30 వేల పైచిలుకు మెజార్టీయే వస్తోంది. గతంలో కాంగ్రెస్ అయినా,ఆ తర్వాత వైసీపీ అభ్యర్థులు అయినా భారీ మెజార్టీలతో విజయం సాధిస్తూ వస్తున్నారు. వైసీపీ కంచుకోట కాబట్టి ఏకగ్రీవం అవుతుంది అనుకునే పరిస్థితులు అయితే లేవు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిచి మృతి చెందింతే , టీడీపీ పోటీలో నిలిచింది. అదే తిరుపతి బై పోల్ కాబట్టి. బద్వేల్ లో కూడా తమ ఓట్ల శాతాన్ని పరీక్షించుకోవడానికైనా కూడా పోటీలో నిలుస్తుంది. అయితే టీడీపీ విజయం సాధించడం మాత్రం దాదాపుగా అసాధ్యం. పోటీలో మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇక బీజేపీ ఎన్నిక ఏదైనా కూడా పోటీకి సై అంటుంది. కడప జిల్లాకే చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బద్వేల్ బీజేపీ అభ్యర్థిపై అప్పుడే ఫోకస్ పెట్టేశారు. ఇక టీడీపీకి కూడా గతంలో ఈ నియోజకవర్గం కంచుకోట. ఇక్కడ నుంచి 1983, 1985, 1994, 1999 లలో నాలుగు సార్లు టీడీపీ గెలిచింది. ఆ తర్వాత మాత్రం ఇక్కడ టీడీపీ జెండా ఎగర్లేదు. అలాగే వైఎస్ వచ్చాకా ఈ బద్వేల్ కాంగ్రెస్ కంచుకోటగా మారింది. అయితే , రెండు దశాబ్దాల తర్వాత టీడీపీ మళ్లీ బద్వేల్ కోటపై టీడీపీ జెండా ను ఎగురవేస్తుందా లేక , ఎప్పటిలానే పోటీ చేసి పోరాడి ఓటమి చెందుతుందో చూడాలి.