జనసేనలోకి మరో కాంగ్రెస్ నేత..

Update: 2018-10-13 07:50 GMT
ఏపీలో జనసేనకు మంచి రోజులొచ్చినట్టున్నాయి. ఇన్నాళ్లు సరైన నాయకులు, క్యాడర్ లేదని ఢీలా పడ్డా ఆ పార్టీ నేతలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేరిక కొండంత బలాన్నిచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని బలమైన నేతలంతా జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. శుక్రవారం జనసేన అధికార ప్రతినిధి విజయ్ బాబు కూడా త్వరలోనే చాలా పెద్ద నాయకులు జనసేనలో చేరబోతున్నారంటూ హింట్ ఇచ్చాడు. ఇప్పుడు పరిణామాలన్నీ చూస్తుంటే జనసేన వైపు నేతలు ఆకర్షితులవుతున్నారని అర్థమవుతోంది.

తాజాగా నాదెండ్ల మనోహర్ బాటలోనే మరో కాంగ్రెస్ నేత జనసేన పార్టీలోకి చేరబోతున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్న కృష్ణా జిల్లా డీసీపీ ఉపాధ్యక్షుడు చలమలశెట్టి రమేష్ బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పవన్ వ్యవహారశైలి, నాయకత్వ పటిమకు, జనసేన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరబోతున్నట్టు రమేష్ బాబు ప్రకటించారు.

రమేష్ బాబు తనతోపాటు తన భారీ అనుచరుగణాన్ని జనసేనలో చేర్పిస్తున్నారు. తన అనుచురులైన   యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ, గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీలను కూడా జనసేనలో చేర్చబోతున్నట్టు ప్రకటించారు. సోమవారం లేదా బుధవారం పవన్ కళ్యాన్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నట్లు ఆయన శనివారం ప్రకటించారు.

నాదెండ్ల రాకతో జనసేనకు ఊపు వచ్చినట్టైంది. అనాధిగా కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు భవిష్యత్ లేనివారందరూ జనసేనవైపే చూస్తున్నారు. ఈ పరిణామం ఆ పార్టీలో జోష్ నింపుతోంది.
Tags:    

Similar News