భాగ్య నగరి హైదరాబాదును డ్రగ్స్ రాకెట్లు చుట్టుముట్టేశాయి. ఎక్కడికక్కడ మకాం వేసేసిన డ్రగ్స్ వ్యాపారులు నగరవాసులకు డ్రగ్స్ ను అలవాటు చేయడమే లక్ష్యంగా ఆ రాకెట్లు దందాను సాగిస్తున్నాయి. ఇప్పటికే కెల్విన్ ఆధ్వర్యంలోని డ్రగ్స్ రాకెట్ ను పట్టుకున్న పోలీసులు... ఆ ముఠాతో సంబంధాలున్న ప్రముఖుల జాబితాను చూసి నోరెళ్లబెట్టిన పరిస్థితి. ఓ కెల్విన్ రాకెట్ తో సంబంధం ఉన్న వారిని విచారించే పని నేటి ఉదయం ప్రారంభం కాగా... అదే సమయంలో మరో డ్రగ్స్ రాకెట్ పోలీసులకు చిక్కింది.
కెల్విన్ రాకెట్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులకు స్పందించక తప్పని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నేటి ఉదయం విచారణ కోసం అబ్కారీ కార్యాలయానికి వచ్చేశారు. ఓ వైపు విచారణ సాగుతున్న సమయంలోనే నగరంలో మరో డ్రగ్స్ రాకెట్ పట్టుబడటం గమనార్హం. ఈ రాకెట్ లో ఇద్దరు నైజీరియన్లతోసహ 9మందిని పోలీసులు పట్టుకున్నారు. కెల్విన్ రాకెట్ లో కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే పట్టుబడగా... ఈ రాకెట్ లో ఏకంగా 9 మంది పట్టుబడిన నేపథ్యంలో ఈ రాకెట్ మరింత విస్తృత నెట్ వర్క్‌ను కలిగి ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ముగ్గురు సభ్యులున్న కెల్విన్ రాకెట్ తోనే సినీ పరిశ్రమకు చెందిన 20 మంది దాకా ప్రముఖుల పేర్లు తెర మీదకు రాగా... తాజాగా పట్టుబడ్డ ముఠాతో ఇంకెంత మంది ప్రముఖుల చీకటి భాగోతాలు బయటపడతాయోనన్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే... తాజా ముఠా నుంచి 17 డోస్‌ల ఎన్ ఎస్ డీ - 300 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా విక్రయిస్తున్న ఈ డ్రగ్స్ గోవా నుంచి వచ్చినవిగా పోలీసులు గుర్తించారు.