ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కు ఒకటి తర్వాత ఒకటి చొప్పున షాకులు తగులుతున్నాయి. ఆన్ లైన్ వాణిజ్య ప్రకటనల మార్కెట్ లో గూగుల్ సంస్థ ప్రదర్శిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. డిజిటల్ రంగంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న గూగుల్ తీరు ఏ మాత్రం పారదర్శకత లేదన్న ఆరోపణలు వెల్లువెత్తటం తెలిసిందే.
గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో యాడ్స్ ఇచ్చే వారందరికి ఒకే రూల్ ఉండాలని స్పష్టం చేసినా.. గూగుల్ ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదన్న విమర్శ ఉంది. ఇప్పటికే ఆ సంస్థ తీరును పలు దేశాలు తప్పు పట్టి భారీ జరిమానాను విధించాయి. తాజాగా ఆ జాబితాలో ఫ్రాన్స్ కూడా చేరింది.
గూగుల్ వాణిజ్య ప్రకటనల్ని అంగీకరించే విధానాలు ఏ మాత్రం సరిగా లేవన్న ఆరోపణను తెర మీదకు తెచ్చిన ఫ్రాన్స్ ఆ సంస్థకు భారీ జరిమానాను విధించింది. సందేహాస్పదంగా మారిన గూగుల్ తీరును తప్పు పడుతూ రూ.1180 కోట్ల భారీ జరిమానాను విధించింది. మరీ.. విషయంలో గూగుల్ స్పందన ఏమిటన్నది ఇంకా తేల్లేదు. అప్పటికే పలు దేశాలు ఫైన్లతో షాకిస్తున్న వేళ.. రానున్న రోజుల్లో ఇలాంటివి మరింత పెరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అదేంది గూగుల్ అలా ఎందుకు చేస్తున్నట్లు?